స్క్రిప్ట్‌లోనే బడ్జెట్ కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలయ్య -బోయపాటి ప్రాజెక్టు సెట్స్‌మీదకు వెళ్లే తరుణం వచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్స్ శరవేగంగా జరుపుకుంటూనే, బడ్జెట్‌ను కుదించేందుకు మరోసారి స్క్రిప్ట్ వర్క్‌పై దృష్టి పెట్టారని సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం సీనియర్ సినిమాటోగ్రాఫర్ రామ్‌ప్రసాద్‌ను తీసుకోవాలని ముందు అనుకున్నా, తాజా సమాచారం ప్రకారం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు చేసిన రూలర్ ప్రాజెక్టుకు రామ్‌ప్రసాద్ పనితనం ఏమాత్రం ప్లస్ కాలేదన్న ఆలోచనకు వచ్చినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ పోలీస్ గెటప్ విషయంలోనూ రామ్‌ప్రసాద్ ఏమాత్రం సజెషన్స్ ఇవ్వకుండా తన పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారన్న అపవాదు ఫ్యాన్స్‌నుంచి బలంగానే వినిపించింది. స్క్రిప్ట్‌లో బడ్జెట్ కంట్రోల్, సినిమాటోగ్రాఫర్ ఎవరు? అన్న రెండు విషయాలు తేలిపోతే వెంటనే సెట్స్‌పైకి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. ఫిబ్రవరి మూడోవారంలో షూటింగ్ మొదలుపెట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి, ఏడాది మధ్యలో సినిమాను థియేటర్లకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారట. హీరో శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేస్తున్న ప్రాజెక్టు -ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి తెరకెక్కించనున్నాడని అంటున్నారు.