ఆమే.. అంతేగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛలో, గీతగోవిందం.. రెండు సినిమాలతో టాలీవుడ్‌లో రెండింతల రేంజ్ సంపాదించుకుంది రష్మిక. టైం మనదైతే స్టార్ తిరుగుతుందన్నట్టు -అకస్మాత్తుగా స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లోకి వెళ్లిపోయింది రష్మిక. కథల ఎంపికపై ఫోకస్‌పెట్టి, కెరీర్‌ను పరిగెత్తించే పాత్రలు చేయగలదంటూ రష్మికను ఎక్కడో ఊహించేసుకున్నారు అభిమానులు. ఊహలెలావున్నా -వాస్తవంలో ఆమే అంతేగా! అన్న డైలాగ్ వినిపిస్తోంది తాజాగా. హీరోయిన్లు గ్లామర్ డాల్సేనన్న అపవాదుగా దూరంగా.. నటనకు ఆస్కారమున్న పాత్రలతోనే ఆకట్టుకుంది రష్మిక. అందుకే ఆమెను ప్రత్యేకంగా చూడటమే కాదు, యంగ్ సెనే్సషన్ అంటూ ఎత్తేశారు. తీరాచూస్తే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రను ఎంచుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. రష్మిక స్పెషల్ అనుకున్నవారికి -ఈ సినిమాతో ఒక్కసారిగా గూస్‌బంప్స్ వచ్చేశాయి. స్టార్ హీరో మహేష్ సినిమా అన్న ఒక్క పాయింట్ తప్ప, ఆమెది కనిపించి వెళ్లిపోయేలాంటి పాత్రేనన్నది నిజం. కమర్షియల్ హీరోయిన్‌గా రాణించాలంటే అప్పుడప్పుడూ ఇలాంటి పాత్రలు తప్పదన్న వాదన వినిపిస్తున్నా, మరీ ఇంతగానా? అన్న దీర్ఘాలూ వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడే అలా.. అని నిరూపిస్తుందో.. ఆమే అంతేగా! అనిపిస్తుందో చూడాలి.