స్టార్ హీరోలతో వర్కౌటయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్. రికార్డులవైపు వసూళ్లు పరిగెడుతున్నాయి. మహేష్‌కు మళ్లీ హిట్టుపడింది. ఈ సినిమాతో స్టార్ హీరోని హ్యాండిల్ చేసే ఎక్స్‌పీరియన్సూ దర్శకుడు అనిల్ రావిపూడికి వచ్చేసింది -లాంటి పండగ కబుర్లన్నీ పాతవైపోయాయి. సో, కొత్త విషయమేంటంటే.. పెద్ద సినిమా చేసేశాడు కనుక అనిల్‌కు స్టార్ డైరెక్టర్ హోదా ఇచ్చేయొచ్చా? అన్న చర్చ మొదలైంది. సరిలేరు నీకెవ్వరు సాలిడ్ హిట్టే అయినా.. దర్శకుడిగా అనిల్‌కు పడుతున్న మార్కులు భారీగా ఏమీ లేవు. అటు మహేష్‌బాబు, ఇటు రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి, హీరోయిన్ రష్మిక మండన్న ప్రమోషన్స్ టైంలో దర్శకుడిని ఆకాశానికి ఎత్తేసినా -సినిమా విడుదల తరువాత ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ నుంచి ఆ ఫీల్ రాలేదు. అనిల్ చేసే సినిమాల్లో సెకెండాఫ్ వీక్ అన్నది ఎప్పటినుంచో ఉన్న మాట. ఈ సినిమాకూ అదే పరిస్థితి ఎదురైందన్నది తాజా చర్చ. మంచివాడైనా, చెడ్డవాడైనా దేశ పౌరుడిని ఆర్మీ చంపదు కనుక -ఆర్మీ జవాను పాత్రలో మహేష్‌తో చేయించిన ప్రయోగాత్మక క్లైమాక్స్ మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు లేదు. ఈ క్లైమాక్స్ వల్లే సెకండ్ హాఫ్ గ్రాఫ్‌ను పైకి లేపే అవకాశం దక్కలేదన్న మాట వినిపిస్తోంది. క్లైమాక్స్ కనుక పవర్‌ఫుల్‌గా ఉండుంటే ‘సరిలేరు నీకెవ్వరు’ రేంజ్ మరోలా ఉండేదన్న కామెంట్లూ వస్తున్నాయి. స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకుని తగిన క్లైమాక్స్‌ను డిజైన్ చేయటంలో దర్శకుడి వైఫల్యంగానే చూస్తున్నారు. ఇక భారీగా ప్రమోట్ చేసిన ట్రైన్ ఎపిసోడ్ కూడా భారీగా ఉండటంతో -ప్రేక్షకులు భరించటం కష్టమైంది. మహేష్‌ను మాస్‌గా చూపించటం, ఫ్యాన్స్ గంతులేసేలా స్టెప్పులేయించటం వరకూ అనిల్‌కు క్రెడిట్ దక్కుతుంది. స్టార్‌హీరోతో కథను కడవరకూ రక్తికట్టించటంలో అనిల్‌కు అరకొర మార్కులే పడటంతో -మరో పెద్ద హీరోతో సినిమా పడటం వెంటనే ఉండకపోవచ్చన్న చర్చ నడుస్తోంది, ‘ఎఫ్3’కి ప్లాన్ చేస్తానని ఇంటర్వ్యూల టైంలో చెప్పుకొచ్చాడు కనుక -మోర్ ఫన్ సినిమా మామూలు హీరోతోనే ఉండొచ్చు.