అలా అయితే పవన్‌కల్యాణ్‌కు చెడ్డపేరు వస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చిరంజీవితో సినిమా తప్పక చేస్తా...అయితే 150వది కాకపోతే ఇంకోటి’ అని అంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి స్టైల్‌లో సినిమా అంటే ప్రేక్షకులకు కూడా ఆసక్తి. ఆయన లేటెస్టుగా రూపొందిస్తున్న చిత్రం లోఫర్. మెగా హీరో వరుణ్‌తేజ్, దిశా పటాని జంటగా ఇందులో నటించిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో పవన్‌కల్యాణ్ అభిమానుల వైఖరిని ఆయన తప్పుబట్టారు. అది పవన్‌కు చెడ్డపేరు తెస్తుందని హెచ్చరించారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ నిర్మించిన ‘లోఫర్’ ఈనెల 17న విడుదలవుతున్న సందర్భంగా పూరి జగన్నాథ్‌తో ఇంటర్వ్యూ...
సినిమా ఎంతవరకు వచ్చింది?
సినిమా మొత్తం పూర్తి అయ్యింది. ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమా తరువాత మదర్ సెంటిమెంట్‌తో చేస్తోన్న సినిమా ఇది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు అయిపోయాయి. ఈనెల 17న విడుదల చేస్తున్నాం. ముఖ్యంగా సెన్సార్ వాళ్ళు సినిమా బాగుందని అభినందించారు.
మదర్ సెంటిమెంట్ అంటున్నారు. మరి ‘లోఫర్’ టైటిల్ ఎంతవరకు కరెక్ట్?
మదర్ సెంటిమెంట్ కనుక ‘మా అమ్మ సీతామహాలక్ష్మి’ అనే టైటిల్ పెట్టాలని భావించాం. ఈ విషయంలో వర్మగారు కూడా ఆ టైటిల్ బాగుందని చెప్పారు. కాని ‘లోఫర్’ అనే టైటిల్ ముందే అందరికీ రీచ్ అవ్వడంతో అదే టైటిల్‌గా పెట్టేశాం. సినిమా బావుంటే ఏ టైటిల్ అయినా ఒకటే. ఈ సినిమాకు ‘లోఫర్’ అనే టైటిల్ పెట్టినా చివరకు హీరో మంచివాడనే చెప్తాం.
గతంలో‘అమ్మా నాన్న తమిళమ్మాయి’ తీసారు కదా. దానికి దీనికి దగ్గర
పోలికలు ఉంటాయా?
ఉండవు. ఆ సినిమా మదర్ సెంటిమెంట్ సినిమా అయినా దానికి లోఫర్‌కు చాలా డిఫరెన్స్ ఉంది. అందులో కొడుకు తల్లితో చిన్నప్పటినుండి కలిసే ఉంటాడు. ఈ సినిమాలో మాత్రం తల్లి ఎక్కడ ఉందో కొడుక్కి తెలియదు. వేరు వేరు చోట్ల ఉంటారు. తల్లి చనిపోయిందని తండ్రి నమ్మిస్తాడు. ఈ సినిమాలో తల్లి మీద ఉండే ‘సువ్వి సువ్వాలమ్మా’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
వరుణ్‌తేజ్‌నే ఈ సినిమాకు
ఎంచుకోవడానికి కారణం?
ఈ కథ ప్రకారం వరుణ్ అయితే బాగుంటుందని ఆయన్ని కలిశాం. తనకు కూడా బాగా నచ్చడంతో ప్రోసీడ్ అయ్యాం. వరుణ్‌లో ఎలాంటి యారోగన్స్, ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్ ఉండదు. వరుణ్ చాలా చక్కగా డైలాగ్స్ చెప్తాడు. తన మొహంలో అమాయకత్వం ఉంటుంది.
అది తనకు ప్లస్ పాయింట్. ఇటీవలే చిరంజీవిగారిని కలిశాను. ఆయన వరుణ్‌తేజ్‌ను ఎంతగానో పొగిడారు. నిజంగా సినిమా చూసినవారు వరుణ్ మూడవ సినిమాలోనే ఇంత బాగా నటించాడా అనుకుంటారు.
మిగతా నటీనటుల గురించి?
ఈ సినిమాకు రైట్ హ్యాండ్ రేవతి, లెఫ్ట్ హ్యాండ్ పోసానిగారు అన్నట్లుగా నటించారు. ఓ చెడ్డ తండ్రిగా పోసాని అద్భుతంగా చేశాడు. ఓ మంచి తల్లి పాత్రలో రేవతిగారి నటన అద్భుతం. మా సినిమాలో నటించమని స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తరువాత ఫోన్‌లో నేరేషన్ ఇచ్చాను. ఆమె వెంటనే ఓకే చేశారు. రేవతిగారు ఆర్ట్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తారు. ఈ సినిమాలో కొన్ని లౌడ్ సీన్స్‌లో నటించేప్పుడు ‘పూరి- నేనెప్పుడూ ఇలాంటి సీన్స్‌లో నటించలేదు. నీ మీద నమ్మకంతో చేసేస్తున్నానని’ చెప్పారు.
మీరు చాలా స్పీడ్‌గా సినిమాలు
తీస్తారు, కారణం?
సినిమా చేసేముందు నేను చాలా ప్లానింగ్‌తో ఉంటాను. స్క్రిప్ట్ విషయంలో చాలా పక్కా క్లారిటీ ఉంటుంది. అదే క్లారిటీ మా టీం అందరికీ ఉండాలని వారిని కూర్చోపెట్టి నేరేషన్ ఇస్తాను. దాంతో వారిలో కూడా అదే క్లారిటీ ఉంటుంది. వెంటనే ప్రాజెక్టు మొదలుపెట్టేశాను. ‘లోఫర్’ సినిమా 65 రోజుల్లో పూర్తిచేశాను.
హీరోయిన్ గురించి?
ఈ సినిమాతో తెలుగులోకి దిశా పటాని ఎంట్రీ ఇస్తుంది. తను బాగా చేసింది. అయితే బొంబాయి అమ్మాయిలకు తెలుగు భాష ఏలియన్ లాంటిది. నా హీరోయిన్లు అందరూ బాలీవుడ్ వాళ్ళే. వారికి డబ్బింగ్ కష్టంగా ఉన్నా మేము ట్రైనింగ్ ఇస్తాం కదా. ఈ సినిమా తరువాత తనకి బాలీవుడ్‌లో ఓ పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చింది.
సునీల్ కశ్యప్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నారు?
సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు. ‘జ్యోతిలక్ష్మి’ సినిమాకు పనిచేశాడు. ఇపుడు ‘లోఫర్’ సినిమా. నా నెక్స్ట్ సినిమా ‘రోగ్’కు కూడా తననే కన్‌ఫర్మ్ చేశాను. మంచి టాలెంట్ వున్న మ్యూజిక్ డైరెక్టర్.
నిర్మాత కళ్యాణ్‌గారితో వరుస సినిమాలు?
నిర్మాత కళ్యాణ్‌గారితో నాకు ఇది రెండో చిత్రం. ఫస్ట్ కాపీ చూసిన తరువాత నాకు ఫోన్ చేసి సినిమా సూపర్‌హిట్, హ్యాపీగా ఉండండి అని చెప్పారు.
మరి చిరంజీవి 150వ సినిమా ఉంటుందా?
చిరంజీవిగారితో నేను తప్పకుండా సినిమా చేస్తా. ఈమధ్యే చిరంజీవిగారి అభిమానులు నా మీద సీరియస్ అయ్యారట. చిరంజీవిగారికి నాకు మధ్య ఉన్న స్నేహం వాళ్లకు తెలియదు కదా. నేను ఆయనను కలిసి మాట్లాడాను. 150 కాకపోతే 151, ఏదైనా ఖచ్చితంగా సినిమా చేస్తా.
ఈమధ్య ఆడియో వేడుకలో అందరూ
ఇరిటేట్ అయ్యారని విన్నాం?
‘లోఫర్’ ఆడియో వేడుకలో అందరూ ఇరిటేట్ ఫీల్ అయ్యారు. ప్రభాస్, నేను కూడా చాలా ఇరిటేట్ అయ్యాం. అక్కడ పవన్ అభిమానులు మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. దానివలన పవన్ కళ్యాణ్‌గారికే చెడ్డపేరు వస్తుంది. పవన్‌కళ్యాణ్‌గారు చెప్పినా వారి ఫ్యాన్స్ వింటారో లేదో తెలియదు.
బ్యాంకాక్‌లోనే మీరు స్క్రిప్ట్
ఎందుకు రాస్తారు
గతంలో ఇక్కడే కథలు రాసుకునేవాడ్ని. డబ్బులు వచ్చాక బ్యాంకాక్ వెళ్లి రాస్తున్నా. నాకు బీచ్‌లో కూర్చొని కథలు రాయడం కంఫర్ట్‌గా ఫీల్ అవుతాను. వైజాగ్ బీచ్‌లో కూర్చొని రాయలేం కదా. అందుకే బ్యాంకాక్ వెళ్తాను. అది నాకు సొంతూరులా అనిపిస్తుంది.
మరి మహేష్‌తో సినిమా ఎప్పుడు?
మహేష్‌బాబు కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాను. చాలా భారీ సినిమాగా ఉంటుంది. అందులో మరో పెద్ద హీరో కూడా ఉంటాడు. దాని వివరాలు త్వరలోనే చెబుతా.
తదుపరి సినిమాలు?
ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషలలో ‘రోగ్’ సినిమా షూటింగ్ మొదలుపెట్టేశాం. ఈ సినిమాతోపాటు మరో సినిమా కూడా త్వరలోనే ఉంటుంది.

-శ్రీ