బన్నీకి విలన్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిజాన్ని పైకిలేపే బలమైన విలనిజం చూపించాలంటే -విజయ్ సేతుపతి ఓ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. కోలీవుడ్ వర్సిటైల్ ఆర్టిస్టుగా సోలో సినిమాలు చేస్తూనే, వివిధ భాషల హీరోల సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తున్నాడు. ఆమధ్య వచ్చిన చిరంజీవి సైరాలో తమిళనాడు ప్రాంత వీరుడి పాత్రతో ఆకట్టుకున్న సేతుపతి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తదుపరి చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. తాజా సమాచారమేంటంటే -విజయ్ సేతుపతి బన్నీ సినిమాలోనూ కీలక రోల్ చేస్తున్నట్టు సమాచారం. బన్నీ -సుక్కూ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రాజెక్టులో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు పరిశ్రమవర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అది పూర్తిస్థాయి విలన్ పాత్రే అయి ఉంటుందన్న అంచనాలు లేకపోలేదు. ఇదే జరిగితే -బన్నీ, సేతుపతి రైవల్ డ్రామా ఆసక్తికరమే. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్టులో బన్నీతో రష్మిక మండన్న రొమాన్స్ చేయనుంది.