భావోద్వేగాల ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి లవ్‌స్టోరీ అన్న పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయగా, దానికి మంచి ఆదరణ లభిస్తోందని యూనిట్ తెలియజేస్తుంది. హీరో హీరోయిన్లు కలిసి వున్న పోస్టర్‌కు మంచి ఇంటెన్సిటీ వున్నదని, ప్రతి ఒక్కరూ ఈ పోస్టర్‌ను మెచ్చుకుంటున్నారని యూనిట్ తెలిపింది. ప్రేమలో కనిపించే భావోద్వేగాలతోపాటుగా శేఖర్ కమ్ముల ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఈ పోస్టర్‌లో తెలుస్తోందని నెటిజన్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌కు తగిన విధమైన లుక్‌ను విడుదల చేశామని, రెహమాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం ఓ ప్లస్ పాయింఠ్ అని నిర్మాతలు నారాయణదాస్, కె.నారంగ్, ప.రామ్మోహన్‌రావు తెలిపారు. ఎమిగోస్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ సంక్రాంతి పండుగ తరువాత ప్రారంభిస్తామని, వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని వారు తెలిపారు. చైతన్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కథను రాయంచామని, సునిశితమైన ఎమోషన్లు బలంగా తెరపై ఆవిష్కరించగల విజన్‌వున్న దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవబోతుందని వారువివరించారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.