బన్నీ అలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మెగా కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం విడుదలై హిట్టుటాక్ తెచ్చుకోవడం తెలిసిందే. బన్నీ కెరీర్‌లోనే అద్భుతమైన వసూళ్లు రాబడుతున్న చిత్రంగా నిలవటంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
అల వైకుంఠపురములో చిత్రానికి సంబంధించి రికార్డ్ ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హమని, ఈ విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానుల సమక్షంలో చిత్ర విజయోత్సవ సభ నిర్వహించబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈనెల 19న వైజాగ్‌లో సెలెబ్రేషన్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ విజయోత్సవ కార్యక్రమానికి సినిమా టీం మొత్తం పాల్గొంటున్నారు.