శెట్టితో తలపడతాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు విష్ణు హీరోగా దర్శకుడు జెఫ్రీ గీ చిన్ తెరకెక్కిస్తోన్న చిత్రం -మోసగాళ్లు. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు డిజైన్ చేశాడు. హాలీవుడ్ యాక్షన్ నిపుణుల సారథ్యంలో ఫైట్ సీన్స్‌ని తాజా షెడ్యూల్‌లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాకు ఈ ఎపిసోడ్ ఓ మాస్టర్ పీస్ కానుందన్న నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది. ఫైట్ సన్నివేశాలను రక్తి కట్టించేందుకు ఇప్పటికే ఇద్దరు స్టార్స్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని, వచ్చే వేసవిలో సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని మేకర్స్ చెబుతున్నారు. కాజల్ అగర్వాల్, నవదీప్, నవీన్‌చంద్ర, రోహి సింగ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.