సుదీప్ లేడట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక ‘ట్రిపుల్ ఆర్’లో తాను లేనంటూ కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో కిచ్చా సుదీప్ కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో రాజవౌళి తెరకెక్కించిన ఈగ చిత్రంలో విలన్ రోల్ చేసిన సుదీప్, బాహుబలి ప్రాజెక్టులోనూ ఓ పాత్ర చేశాడు. రాజవౌళి అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ఈ భారీ ప్రాజెక్టులోనూ కిచ్చా సుదీప్‌కు పాత్ర కల్పించాడంటూ కథనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా సుదీప్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ‘ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ట్రిపుల్ ఆర్‌లో ఎలాంటి పాత్ర కోసం ఎవ్వరూ నన్ను సంప్రదించలేదు’ అంటూ స్పష్టత ఇవ్వడం గమనార్హం. ట్రిపుల్ ఆర్ సినిమాను జూలై 30న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ముందుగానే అధికారికంగా ప్రకటించింది. అయితే, అనేక కారణాలతో షూటింగ్ ఆలస్యమైన కారణంగా విడుదల తేదీ వెనక్కి జరిగొచ్చన్న కథనాలూ వినిపిస్తున్నాయి. ముందే ఊహించినట్టే -అక్టోబర్‌లో సినిమా విడుదలకు చాన్స్ ఉందన్నది కథనాల సారాంశం. ఇదిలావుంటే, జనవరి 20నుంచి ట్రిపుల్ ఆర్ కొత్త షెడ్యూల్ మొదలు కావొచ్చని అంటున్నారు. తాజా షెడ్యూల్‌లో రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర కాంబినేషన్ సన్నివేశాలు తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. జక్కన్న ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ సోషియా ఫాంటసీ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తుంటే, కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.