బాలీ పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈషా ఫిగర్‌కి ఉన్న ఇమేజే వేరు. ట్రెండ్‌ని అనుసరిస్తూ, హస్కీ గ్లామర్ అప్పీల్‌ని ఇవ్వగల బ్యూటీ ఈ తెలుగమ్మాయి. ఇటీవల సోషల్ మీడియాలోనూ రెగ్యులర్ ఫొటోషూట్స్‌తో కుర్రకారుకు బుర్రల్లో కుర్చీ వేసుకుని కూర్చుంది. అలాంటి ఈషాకు -బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అనిల్‌కఫూర్ వారసుడు హర్షవర్థన్ కఫూర్‌కు జోడీగా ఓ సోషల్ కానె్సప్ట్‌తో తెరకెక్కనున్న మూవీలో ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది. రాజ్‌సింగ్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. రాజస్థానీ అమ్మాయి పాత్రలో ఈషా కనిపించనున్నట్టు టాక్. స్ర్తిశక్తిని ఎలివేట్ చేసే కథాంశంతో సినిమా తెరకెక్కునుందని అంటున్నారు. ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈషాకు, లేడీ ఓరియంటెండ్ ఫిల్మ్‌లో నటించే అవకాశమున్న పాత్ర దొరికినట్టేనని అంటున్నారు. ఈ పాత్రతో ఈషా ఎంత మెప్పిస్తుందో చూడాలి. ఇదిలావుంటే, ఎస్సార్కే చిత్రంతో అటు కన్నడలో, మరో తమిళ చిత్రంతోనూ సౌత్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది ఈషా.