మొదలైంది విధి విలాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ జోడీగా ఎస్‌కెఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి నిర్మిస్తోన్న చిత్రం -విధి విలాసం. దుర్గా నరేష్ గుత్తా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై షూట్ చేసిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్‌కొట్టగా, డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. జీవితా రాజశేఖర్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్ అందించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు దర్గా నరేష్ గుత్తా మాట్లాడుతూ ‘ఆదిత్ నాకు మంచి స్నేహితుడు. ఆనయతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. శివాత్మిక పెర్ఫార్మెన్స్‌కి మంచి స్కోప్‌వున్న పాత్ర. విధి విలాసం టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రామాయణం ఎలాగైతే మూడు కోణాల్లో ఉంటుందో, మా సినిమాని కూడా అలాగే అర్థం చేసుకుంటారు అన్నారు. హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ -కథ విన్నపుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నా. ఆదిత్ నాకు చాలాకాలంగా మంచి స్నేహితుడు. ఆయనతో కలిసి నటించటం హ్యాపీ. నరేష్ మాటల్లోనూ మంత్రాలుంటాయి. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్నారు. నిర్మాత శివదినేష్ మాట్లాడుతూ -నరేష్‌ని కలిసిన మొదటి సిట్టింగ్‌లోనే కథను ఓకే చేశాం. అలాగే హీరో ఆదిత్, హీరోయిన్ శివాత్మిక మా ఫస్ట్ చాయిస్. ఇద్దరూ కథకు యాప్ట్ అనిపిస్తారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సమ్మర్‌లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నాం అన్నారు. హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ -దశరథ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసిన దుర్గానరేష్ వెరీ టాలెంటెడ్. మంచి పెర్ఫార్మర్ శివాత్మికతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. నిర్మాత శివ ఫస్ట్ సిట్టింగ్‌లోనూ కథను ఓకే చేశారు. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతో ఈ సినిమా చేస్తున్నాం అన్నారు. ఇంద్రజ, కోట శ్రీనివాస రావు, జయప్రకాష్, పోశాని, రాజారవీంద్ర తదితరులు నటిస్తోన్న చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ ఎస్‌వి విశే్వశ్వర్ సమకూరుస్తున్నారు.