‘నాంది’ పలికిన నరేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓల్డ్ ట్రెండ్ కామెడీకి కాలం చెల్లడంతో -నరేష్ ట్రాక్ మార్చేందుకు రెడీ అయ్యాడు. కామెడీ టైమింగ్‌తో ఇప్పటి వరకూ కెరీర్ లాక్కొచ్చిన నరేష్ -ఓ సీరియస్ సబ్జెక్ట్‌తో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. తాజాగా విడుదలైన అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ పోస్టర్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండు రోజుల క్రితం సీరియస్ ఇంటెన్స్ లుక్‌తో అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదలైతే, సోమవారం మరింత ఆసక్తి కలిగించేలా టైటిల్ పోస్టర్ రిలీజైంది. పోలీస్ టార్చర్ మధ్య -న్యూడ్‌గా తలకిందులుగా వేలాడుతున్న నరేష్ చూపిస్తూ విడుదలైన ‘నాంది’ టైటిల్ పోస్టర్ గూస్ బంప్స్ ఇస్తోంది. కొత్త ప్రొడక్షన్స్ హౌస్ ఎస్‌వి2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సోమవారం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రధారులు. దేవుని పటాలకు నమస్కరిస్తున్న నరేష్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హరీష్ శంకర్ క్లాప్‌నిస్తే, అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశాడు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ -కొత్తవాళ్లతో చేస్తున్న సినిమా ఇది. రచయిత అబ్బూరి రవితో పని చేయాలన్న నా ఆశ ఇప్పటికి తీరుతుంది. ఇదొక క్రైం థ్రిల్లర్. కామెడీ జోనర్‌ను పక్కనపెట్టి ఓ ఇంటెన్స్ ఫిల్మ్‌తో ఆడియన్స్ ముందుకొస్తున్నా’ అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ -సోషల్ ఎలిమెంట్ మిక్స్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. కొత్తదని చెప్పనుకానీ, వెరీ ఇంట్రెస్టింగ్ అన్నారు. నిర్మాత సతీష్ వేగెశ్న మాట్లాడుతూ -నిర్మాతగా పరిచయమవుతున్నా. నాకు చాలా ఇష్టమైన ఈవీవీ అబ్బాయి నరేష్‌తొ సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. కొత్త స్టోరీతో సినిమా మొదలెట్టాం. జనవరి 27నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టి మార్చి 17కి పూర్తి చేస్తాం. వేసవిలోనే సినిమాను థియేటర్లకు తెచ్చే ఆలోచన చేస్తున్నాం అన్నాడు. రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ -నరేష్‌తో పని చేయాలని చాలాకాలంగా ఉంది. ఇప్పుడు కుదిరింది. దర్శకుడు విజయ్‌కి కథమీద ఫోకస్, విజన్ ఉంది. నిర్మాత మంచి కథను ఎంచుకున్నారు. నరేష్ తన జోనర్ మార్చుకుని చేస్తున్న సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో పోస్టరే చెబుతుంది అన్నాడు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ సిద్ సమకూరుస్తున్నారు.