ఆ ఫీలింగ్.. వెరీ హ్యాపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక గొప్ప సినిమా చేసిన ఫీలింగ్ శాశ్వతంగా ఉంటుంది. ఆ సినిమా సృష్టించే రికార్డులు మాత్రం జస్ట్ టెంపరరీ. ఈరోజు నాదైతే, రేపు మరొకరిది కావొచ్చు. బట్, మంచి సినిమాతో వచ్చే ఆదరాభిమానాలు మనసుకు ఇచ్చే సంతృప్తి అన్నాడు హీరో అల్లు అర్జున్. బన్నీ -త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అల.. వైకుంఠపురములో. పూజాహెగ్దె నాయికగా నటించిన చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. మొదటి వారంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సందర్భంగా విశాఖలో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ -సామజవరగమనా, రాములో రాములా, ఓ మైగాడ్ డాడీ, బుట్టబొమ్మలాంటి పాటలతో వన్ బిలియన్ వ్యూస్‌తో ‘ఆల్బమ్ ఆఫ్ ది డికేడ్’ ఇచ్చిన తమన్‌కి ధన్యవాదాలు. సినిమా కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంత ప్రాణం పెట్టారో సాధించిన విజయం చెబుతుంది. జులాయితో మేం మొదలుపెట్టిన హారిక అండ్ హాసినీ క్రియేషన్స్‌తో నేను చేసిన మూడో సినిమా ఇది. తన హీరోని ఒక మెట్టు పైకెక్కించాలనే ప్రేమతో సినిమా చేసిన నిర్మాత రాధాకృష్ణకు థాంక్స్. చిరంజీవి, రజనీకాంత్, రామ్‌చరణ్.. ఇలా ఎందరితోనో నా ఫాదర్ ఇండస్ట్రీ హిట్లు తీశారు. నాతో ఎన్నో సినిమాలు చేసిన నా ఫాదర్‌తో ఒక్క ఇండస్ట్రీ రికార్డు సినిమానైనా కొట్టాలి అనుకునేవాడిని. నిజంగా ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొట్టడం నాకు స్వీటెస్ట్ మెమరీ. సాధారణంగా ఒక దర్శకుడు హిట్టు సినిమా తీస్తాడు. లేదంటే హీరోకి మంచి హిట్టిస్తాడు. కాకపోతే, ఈ సినిమాతో త్రివిక్రమ్ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ హిట్టిచ్చాడు. సినిమా ఒక పెయింటింగ్ అనుకుంటే.. హీరో, నిర్మాత, ఆర్టిస్టులు, టెక్నీషియన్లును కాన్వాస్, ఫ్రేమ్, బ్రష్షులు, కలర్స్‌గా వాడి అద్భుతమైన పెయింటింగ్‌ను ఆవిష్కరించేది దర్శకుడే. అలాంటి త్రివిక్రమ్‌కు ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా తక్కువే. కొత్త దశాబ్దంలో ఈ విజయం నా మొదటి అడుగుగా భావించి, అందరి అభిమానం, దీవెనలతో మరింత ముందుకెళ్తానని ప్రామిస్ చేస్తున్నా అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ -శ్రీశ్రీ, చలం, రావిశాస్ర్తీ, సీతారామశాస్ర్తీలాంటి సాహితీపరుల్ని అందించిన మహానగరం విశాఖ. సినిమాని తన భుజాన మోసిన తమన్‌కు థాంక్స్. విలువలతో సినిమా తీస్తే ఆదరించకపోవడం అంటూ ఉండదని నిరూపించిన తెలుగు ప్రేక్షకుల సంస్కారానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. వీటన్నింటికీ మించి కథ విన్నప్పటి నుంచీ వదిలేయకుండా ముందుకు నడిపించిన బన్నీకి థాంక్స్. తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లగల స్టామినా బన్నీలో ఉంది. సో, మన కథని గొప్ప సినిమాలుగా ప్రపంచం నలుమూలలకీ చెప్పేంత శక్తిని మనందరం బన్నీకిద్దాం అన్నారు. హీరోయిన్ పూజా హెగ్దె మాట్లాడుతూ -ఒక సినిమాకు సక్సెస్ టీం ఎఫర్ట్‌తోనే సాధ్యం. అందుకే మా టీం మొత్తానికి థాంక్స్. నాకు ఇంత పెద్ద హిట్టిచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌కు కృతజ్ఞతలు. బుట్టబొమ్మ పాటతో నన్ను తెలుగమ్మాయిని చేసేశారు. బన్నీతో రెండో సినిమా మరింత హ్యాపీనిచ్చింది. భవిష్యత్‌లో బన్నీ మరిన్ని సక్సెస్‌లు అందుకోవాలని, మళ్లీ కలిసి నటించాలని ఆశపడుతున్నా అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ పదేళ్లలో వంద సినిమాలు చేశాను. కానీ, త్రివిక్రమ్‌తో పని చేయడానికి నాకు పదేళ్లు పట్టింది. సాధారణంగా మంచి దర్శకుడితో పరిగెత్తడమే కష్టం. రైటర్ కూడా అయిన దర్శకుడితో పరిగెత్తడం ఎంత కష్టమో ఆలోచించండి. తెలుగు భాషను కాపాడే సోల్జర్ త్రివిక్రమ్‌ను మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, నటుడు అజయ్, ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.