సుకుమారే చెప్పాలి మరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల.. హిట్టుతో ఊపుమీదున్న బన్నీ -తదుపరి ప్రాజెక్టుగా సుకుమార్‌తో సెట్స్‌పైకి వెళ్లనుండటం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో స్మగ్లింగ్ కంటెంట్‌తో తెరకెక్కనున్న చిత్రానికి ‘శేషాచలం’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు కథనాలొచ్చాయి. అయితే, వాటిలో నిజం లేదంటోంది మైత్రీ మూవీ మేకర్స్. ఇంకా వర్కింగ్ టైటిల్ కూడా అనుకోలేదట. వచ్చే నెలలో సినిమా సెట్సపైకి రావొచ్చని అంచనా. ఫస్ట్ షెడ్యూల్‌లోనే బన్నీ జాయనయ్యే చాన్స్ ఉంది. బన్నీకి 20వ సినిమాగా, బన్నీ-సుక్కూ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కనున్న చిత్రానికి త్వరలోనై టైటిల్‌పై డెసిషన్ తీసుకుంటారని తెలుస్తోంది. హిట్టయిన అల.. చిత్రంలో మధ్యతరగతి కుర్రాడిగా కనిపించిన బన్నీ, కొత్త ప్రాజెక్టులో కంప్లీట్ రఫ్ లుక్‌లో కనిపిస్తాడని అంటున్నారు. బన్నీ- రష్మిక మండన్న జోడీగా రానున్న ప్రాజెక్టుకు దర్శకుడు సుకుమార్ ఏం టైటిల్ చెబుతాడో చూడాలి.