17నుంచి రింగులోకి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటికప్పుడు సరికొత్త కథలు తీసుకుని వరుస విజయాలతో హిట్లు అందుకుంటున్న వరుణ్‌తేజ్ తాజాగా బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నాడు. ఇప్పటికే ఎఫ్-2, గద్దలకొండ గణేష్ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో నటుడిగా ప్రూవ్ చేసుకున్న వరుణ్‌తేజ్ తాజా చిత్రం ఫిబ్రవరి 17న వైజాగ్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ అంతా వైజాగ్‌లోనే జరగనున్నది.
ఈ చిత్రంకోసం వరుణ్‌తేజ్ కూడా బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. గతంలో విడుదలైన రెండు హిట్ చిత్రాల నేపథ్యంతో వరుణ్ తాజాగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సంగతిని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు అల్లు బాబి, సిద్దూముద్ద భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్, కొరియోగ్రాఫర్ లార్నెల్ స్టోవాల్ ఈ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు. సినిమాకు ఎటువంటి ఆకర్షణలు ఉంటే ప్రేక్షకులు ఇష్టపడతారో అటువంటి అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని, తొలి షెడ్యూల్ పూర్తయ్యాక మరికొన్ని వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. సునీల్‌శెట్టి ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తుండగా సినిమాకు హైలెట్ కానుంది.