నారప్పగా వెంకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో ధనుష్ ఇమేజ్‌ను అమాంతం పైకి లేపిన చిత్రం -అసురన్. గ్రామీణ వాతావరణంలో కులాల వ్యత్యాసాల ఘర్షణలపై తెరకెక్కిన చిత్రం సెనే్సషన్ హిట్టుగా నిలిచింది. ధనుష్ పెర్ఫార్మెన్స్‌కూ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ తరఫున సురేష్‌బాబు తీసుకోవడం తెలిసిందే. ధనుష్ పోషించిన నడివయస్కుడి పాత్రను వెంకటేష్ పోషిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి ‘నారప్ప’ టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 1980ల నాటి పీరియాడిక్ ఫిల్మ్‌గా దళిత్ కానె్సప్ట్‌తో వస్తోన్న పక్కా మాస్ చిత్రం కావడంతో -ఈ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. పెర్ఫార్మెన్స్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని వెంకీమామతో నిరూపించుకున్న వెంకటేష్, కొత్త ప్రాజెక్టు కోసం గెడ్డం పెంచి రఫ్‌లోకి మారాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న ఈ రీమేక్ తాజా షెడ్యూల్ అనంతపురంలో జరుగుతోంది. నెలపాటు సాగే షెడ్యూల్‌లో వెంకటేష్ సహా కొత్త ముఖాలతో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్టు సమాచారం. మహేష్‌తో చేసిన బ్రహ్మోత్సవంతో ఎదురు దెబ్బ తిన్న శ్రీకాంత్ అడ్డాల ఈ ప్రాజెక్టు హిట్టుకోసం పూర్తి ఫోకస్ పెడుతున్నాడట.