హృద్యంగా.. మై లవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవర్స్ డే రోజున రానున్న రౌడీ లవ్ థీమ్ -వరల్డ్ ఫేమస్ లవర్. యూత్ సెనే్సషన్ హీరో విజయ్ దేవరకొండతో క్రాంతిమాధవ్ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో -ఫేమస్ లవర్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్ చేసేందుకు చిత్రబృందం ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే రౌడీ లవర్‌తో హీరోయిన్ల పాత్రల్ని పోస్టర్స్‌లో ఇంట్రొడ్యూస్ చేసిన డబ్ల్యుఎఫ్‌ఎల్ టీం -తాజాగా లవ్ థీమ్ సాంగ్‌ని బయటకు వదిలింది. గోపీసుందర్ డిజైన్ చేసిన ఆల్బమ్‌లో ‘మై లవ్’ అంటూ మంద్రమైన సంగీతంతో రొమాంటిక్‌గా సాగే సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేమికులు ఒకరిపై మరొకరికున్న ప్రేమను వ్యక్తపర్చుకునే కంటెంట్‌తో వచ్చిన సాంగ్ యూత్‌కి బలంగా కనెక్టయ్యేలానే ఉంది. శ్రీకృష్ణ, రమ్యబెహరా హృద్యంగా ఆలపించిన పాటను రహమాన్ రచించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ఓ పెయిన్ ఫుల్ డైలాగ్‌తో ఆకట్టుకున్న విజయ్ సరసన క్యాథరీన్ థ్రెసా, రాశి ఖన్నా, ఐశర్య రాజేష్, ఇజా బెల్లె హీరోయిన్లుగా కనిపించనున్నారు. కెఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కెఎ వల్లభ నిర్మిస్తున్న చిత్రానికి జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఓ ప్రేమికుడి జర్నీలో విజయ్ దేవరకొండ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడన్నది చూడాలంటే ఫ్రిబవరి 14 వరకూ ఆగాలి.