ఫెయిల్యూర్స్‌ని ప్రేమిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో, విలన్ అన్న క్యాటగిరీ టార్గెట్స్‌తో ఇండస్ట్రీకి రాలేదు. కెమెరా ఫ్రేమ్‌లో కనిపిస్తే చాలన్న కిక్
మాత్రమే ఉండేది. చాలాకాలం స్ట్రగుల్ తరువాత ఆ ఛాన్స్ దక్కింది. అలాగని నటుడైపోయానన్న ఫీలింగ్ కూడా నాకు లేదు. ఆశపడిన అవకాశం వచ్చింది. పరిగెడుతున్నా. నాముందూ, వెనుకా పరిగెడుతున్న
వాళ్లు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.
ఇక్కడ చాన్స్ రావడమే చాలా గొప్ప.

సక్సెస్‌పై నాకెప్పుడూ ఫోకస్ లేదు. పడిన ప్రతి బాల్‌నీ సిక్సర్లు కొట్టలేంగా. ఎప్పుడూ ఆ స్పృహలో ఉంటా. కాకపోతే, ఫెయిల్యూర్స్‌తోనే మనల్ని మనం కరెక్ట్‌గా జడ్జ్ చేసుకోగలమన్నది నా నమ్మకం. ఫెయిల్యూర్ వచ్చినపుడు రివ్యూ చేసుకుంటా. పొరబాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. అందుకే ‘ఐ ఎంజాయ్ ద ఫెయిల్యూర్స్’ -అంటున్నాడు బాబీ సింహా. సినిమాలపై మోజుతో చెన్నై వెళ్లిపోయిన తెలుగు కుర్రాడు బాబీసింహా. తమిళంలో ‘జిగర్తాండ’ చిత్రంతో పూర్తి లైమ్‌లైట్‌లోకి వచ్చిన బాబీ సింహా -రవితేజ డిస్కోరాజాలో ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నాడు. జనవరి 24న సినిమా విడుదలవుతున్న సందర్భంలో ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం మీడియాతో ముచ్చటించాడు.
మీ బాల్యం..?
నేను పుట్టిన ఊరు మచిలీపట్నం. ఫోర్త్ వరకూ అక్కడే చదివా. తరువాత టెన్త్ వరకూ అవనిగడ్డలో చదువుకున్నా. కాలక్రమంలో సినిమాలపై ఆసక్తి పెరగడంతో 95లో చెన్నై వెళ్లిపోయా. అలా అక్కడే ఇండస్ట్రీలో ట్రై చేసుకున్నా. ఫాదర్ ఇప్పుడు కొడైకెనాల్‌లో రైతు.
ఇన్‌స్పిరేషన్..
కచ్చితంగా రజనీకాంత్. ఆయనంటే చాలా చాలా ఇష్టం. తరువాత చిరంజీవి, అమితాబ్, కమల్‌హాసన్.. ఇలా దిగ్గజాలంతా నాకు ఇన్‌స్పిరేషనే. ఒక్కొక్కళ్ల దగ్గర ఒక్కో ఇండివిడ్యువాలిటీ. వంటిబట్టించుకునే సత్తా మనకుండాలిగానీ, అలాంటివాళ్లను చూస్తూ నేర్చుకోడానికి చాలావుంది.
డిస్కోరాజాతో..
ఇదొక కమర్షియల్ కమ్ కంటెంట్ ఓరియంటెడ్ సైఫై ఫిల్మ్. రాతలోను, తీతలోను దర్శకుడు విఐ ఆనంద్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ఆయన అప్రోజ్, ప్రజెంటేషన్ వైవిధ్యంగా ఉంటుంది. ఓ మంచి సినిమాలో క్రియేటివ్ డైరెక్టర్ నాకు అవకాశమివ్వడమే గొప్ప. సినిమాను బాగా ఎంజాయ్ చేశా. ఆడియన్స్ కూడా చేస్తారనే అనుకుంటున్నా.
ఎలా కనిపిస్తారు?
ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటానని మాత్రం చెప్పగలను. మరోలా చెప్పాలంటే -జిగర్తాండతో నాపైపడిన నెగెటివ్ ఇంప్రెషన్ పూర్తిగా ఈ పాత్రతో చెరిగిపోతుందనీ చెప్పగలను. సీరియస్, జోవియల్.. డిఫరెంట్ స్టైల్.. అన్నీ పాత్రలో మిళితమై ఉంటాయి.
రవితేజతో..
హీరో రవితేజ ఎనర్జీ లెవెల్స్ అందరికీ తెలిసిందే. ఈకోణంలో ఆయన ప్లస్ అనుకుంటే.. ఆయన్ని అబ్జర్వు చేస్తూ మైనస్‌గా -స్క్రీన్‌ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశా. ఇక రవితేజ టైమింగ్, పంక్చువాలిటీ, స్పీడ్, ఫోకస్‌ని దగ్గర్నుంచి చూశా. వెరీ ఇంప్రెస్డ్.
ప్రాజెక్టులో..
ఫస్ట్ కథ బాగా నచ్చింది. అందుకు తగిన పాత్ర ఇంప్రెసివ్‌గా ఉంది. ఆడియన్స్‌కి కనెక్టవ్వాలంటే -ప్రధానంగా ఈ రెండూ ఉండాలి. అవి ఉన్నాయి కనుక ప్రాజెక్టుకు ఓకే చెప్పాశా. నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. చెప్పాను, ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నంగా కనిపిస్తాను.
డబ్బింగ్..?
నేనే చెప్పాను. ఏ భాషలో సినిమా చేసినా డబ్బింగ్ నేనే చెప్పుకుంటా. భాష తెలీకున్నా తెలుసుకునే చెప్పే ప్రయత్నం చేస్తా. అలాగైతేనే పర్ఫెక్షన్ ఉంటుందన్నది నా ఫీలింగ్.
తెలుగులో..?
చాన్స్‌లు చాలానే వస్తున్నాయి. కానీ, ఎందుకు చేయాలని నన్ను నేను ప్రశ్నించుకుంటా. అందుక్కారణం -వైవిధ్యమైన పాత్రలైతేనే చేయాలన్నది ముందే పెట్టుకున్న ప్రిన్సిపుల్. సో, ఒక క్యారెక్టర్ హిట్టయితే అదే తరహా పాత్రలొస్తే చేయలేను. ఆర్టిస్టుగా వర్సటైల్ షేప్ ఆశిస్తాను కనుక, ఎక్కువ చేయకున్నా మంచి పాత్రలు కోరుకుంటున్నా.
దర్శకత్వంవైపు..?
నాలో అంత మాసాలా లేదండి. బట్, కథలంటే నాకు చాలా ఇష్టం. బహుశ, కంటెంట్ బేస్డ్ సినిమాలపై ఆసక్తి చూపించడానికి కారణమదే అయివుంటుంది. డిస్కోరాజా కంటెంట్ నచ్చి చేసిన సినిమా.
వైవిధ్యంగా కనిపిస్తారు?
ఏ సినిమాలోనైనా నా పాత్ర వర్కౌటవుతుందంటే -కచ్చితంగా అది దర్శకుడి ప్రతిభే. చేయబోయే పాత్రకు తగిన ఇన్స్‌పుట్స్ అన్నీ దర్శకుడే ఇచ్చేస్తాడు. ఓ ట్వెంటీ పర్సంట్ షుగర్ కోట్ మాత్రమే నేను వేసేది. ఏ పాత్ర పండినా -ఆల్వేస్ డైరెక్టర్ గ్రేట్.
తెలుగులో ఎవరితో..
అలా ఏం లేదండి. భవిష్యత్‌లో ఎవరితో అవకాశం వచ్చినా చేయాలి, చేస్తాను కూడా. నేను చేసేది చిన్న సినిమానా, పెద్దదా? అని కూడా చూడను. పాత్ర నాకు నచ్చితే ఓకే చెప్పేస్తా.
విజయ్ సేతుపతికంటే..
డౌట్ లేదు. వెనకే ఉన్నా. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత అంతా రేసులో పరిగెత్తాలి. కాకపోతే, ఒక్కో ప్లేస్‌లో ఒక్కొక్కరు. కచ్చితంగా విజయ్ ముందు పరిగెడుతున్నాడు. వెనుక నుంచి చూస్తూ, అతని పరుగును ఎంజాయ్ చేస్తున్నా.
ఏమైనా మిస్సయ్యారా?
సినిమాల గురించి చెప్పలేనుగానీ, ఒకప్పటి క్రేజీ లైఫ్ మిస్సైన ఫీలింగ్ అప్పుడప్పడూ అనిపిస్తుంటుంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి జూనియర్ ఆర్టిస్టుగానూ చేశా. అప్పట్లో ఒక ప్రేమ్‌లో కనిపించటమే గొప్ప. సాయంకాలం బత్తాలు తీసుకున్న తరువాత -న్యూస్‌పేపర్లు కిందపర్చుకుని ఉన్నదాంట్లోనే ఎంజాయ్ చేస్తూ 70ఎంఎం స్క్రీన్‌మీద భవిష్యత్ కలలు కనేవాళ్లం. నిజంగా నాకవి గోల్డెన్ డేస్. అవి మిస్సయ్యానని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. బట్, మొదలుపెట్టిన తరువాత పరుగు ఆపలేం. పరుగు కారణంగా ఓకేచోట ఉండలేం.