ముందే వస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

96. ఇటీవలి కాలంలో సౌత్ సినిమాల్లో దీనికొక ఇంపార్టెన్స్ ఉంది. ప్రేమికుల తొలి జీవితంలోని మధుర క్షణాలను మలి జీవితంలో గుర్తు చేసుకునే -చిత్రమైన అనుభూతే కథాంశంగా తెరకెక్కిన చిత్రమిది. సినిమాటోగ్రాఫర్ ప్రేమ్‌కుమార్ దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే సెనే్సషన్ హిట్టందుకున్నాడు. తన జీవితంలోని అనుభవాలకు కొంత హృద్యమైన కల్పన జోడించి ప్రేమకథగా తీర్చిదిద్దానని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాడు కూడా. ఈ చిత్రమైన ప్రేమకథకు విజయ్ సేతుపతి, త్రిష తమ అభినయంతో మరో లెవెల్‌కు తీసుకెళ్లడం తెలిసిందే. ఆ హిట్టు చిత్రానికి తెలుగు రీమేక్‌గా వస్తున్నదే -జాను. సమంతా, శర్వా లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. దిల్‌రాజు సారధ్యంలో రూపుదిద్దుకున్న తెలుగు రీమేక్ నుంచి ఇటీవలే టీజర్ విడుదలై ఆకట్టుకుంది. సినిమాకు ‘ప్రాణ’పదమైన పాట సైతం విడుదలై శ్రోతల మనసును తాకింది. మొదలైన దగ్గర్నుంచీ పాజిటివ్ బజ్‌తో వున్న సినిమా ఫిబ్రవరి 14కి వస్తుందని అంతా ఊహించారు. ఆమేరకు కథనాలూ వచ్చేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఒకవారం ముందు -్ఫబ్రవరి 7న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించేశారు. ఫిబ్రవరి 14న విజయ్ దేవరకొండ సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజవుతోంది. అదీ ప్రేమకథే. రెండు ప్రేమ కథల మధ్య పోటీ మంచిది కాదన్న ఉద్దేశంతో ‘జాను’ను వారం ముందే థియేటర్లకు తెస్తున్నారు. రీమేక్‌కూ ప్రేమ్‌కుమారే దర్శకుడు, గోవింద్ వసంతే సంగీత దర్శకుడు. ఈ జాను -ఎలాంటి అనుభూతి నిస్తుందో చూడాలి.