ప్రభాస్ తల్లిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మైనే ప్యార్ కియా’ అనగానే గుర్తుకొచ్చే బ్యూటీ నేమ్ భాగ్యశ్రీ. అన్ని భాషల్లోనూ ఆ సినిమా సెనే్సషన్ సృష్టించటానికి అనేక కారణాల్లో -్భగ్యశ్రీ ముఖ్య కారణం. అప్పట్లో దక్షిణాది ప్రేక్షకులూ ఆమె ప్రేమలో పడిపోయారు. తరువాత నందమూరి బాలకృష్ణ ‘రాణా’లో చెల్లెలి పాత్రలో భాగ్యశ్రీ మెరిసి మాయమైంది. ఆ తరువాత టాలీవుడ్ వైపు ఆమె కనె్నత్తి చూడలేదు. దశాబ్దాల తరువాత -మళ్లీ భాగ్యశ్రీ తెలుగు తెరపై తళుక్కుమనబోతోందట. అదీ -యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి తల్లిగా. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న జాన్ (వర్కింగ్ టైటిల్‌గా ప్రచారంలో ఉంది)లో భాగ్యశ్రీ తల్లి పాత్ర పోషించనుందట. చాలా ప్రాధాన్యత కలిగిన పాత్ర కావడంతో -ఆమెను ఒప్పించారంటున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం దాదాపు కన్ఫర్మ్ చేసింది. ఈ సినిమాతో ఆమె ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ చేసిన సాహో పాన్ ఇండియా సినిమాగా వచ్చింది. ఇప్పుడు జాన్ ఆ స్థాయిలోరాకున్నా, నేషనల్ వైడ్ గుర్తింపుతోనే రావడం ఖాయం. అందుకు తగ్గట్టే ఆర్టిస్టుల్నీ వివిధ భాషల నుంచి తీసుకున్నారు. ఇక ప్రభాస్‌కు జోడీగా చేస్తున్న పూజాహెగ్డే ఉత్తర, దక్షిణాది ప్రేక్షకులకు సమంగా దగ్గరైంది. ‘సాహో’ను నిర్మించిన యువీ క్రియేషనే్స -పునర్జన్మల నేపథ్యంగా కథను నిర్మిస్తోంది. ఈమధ్యే ప్రభాస్ షేడ్‌తో ఓ లుక్‌నూ బయటకు వదిలారు. భారీగా వస్తోన్న ప్రాజెక్టుతో భాగ్యశ్రీకీ మంచి గుర్తింపు రావొచ్చన్న మాట వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత భాగ్యశ్రీ వరుస ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతుందేమో చూడాలి.