నాని.. మరొకటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వి’తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ రోల్ చేస్తోన్న విషయం తెలిసిందే. కెరీర్‌లోనే ఈ పాత్ర ప్రత్యేకమని నాని చెబుతున్నాడు. ప్రాజెక్టు దాదాపు పూర్తి కావడంతో, ఈ సినిమా నుంచి నెమ్మదిగా ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. నాని తదుపరి ప్రాజెక్టు ‘టక్ జగదీశ్’ ఇప్పటికే సెట్స్‌పై వుంది. ఆ ప్రాజెక్టు కొలిక్కి రాకముందే -మరో ప్రాజెక్టుకూ నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనుందట. ఇప్పటికే నితిన్‌తో భీష్మ, రంగ్ దే సినిమాలను ప్లాన్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్, తాజాగా నాని చిత్రాన్నీ లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యన్, నాని కొత్త ప్రాజెక్టుకు దర్శకుడిగా తెలుస్తోంది. ‘టక్ జగదీశ్’ పూర్తి కాగానే నాని.. గ్యాప్ తీసుకోకుండా కొత్త ప్రాజెక్టుతో సెట్స్‌పైకి రావొచ్చని అంటున్నారు. నానితో రొమాన్స్ చేసే నాయిక ఎవరన్నది తెలియాల్సి ఉంది.