మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్.. సరిలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు కథానాయకుడుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశం హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని నిజమైన సంక్రాంతి అనుకునేలా బ్లాక్‌బస్టర్‌కా బాప్ అనే రేంజిలో విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సంక్రాంతికి విడుదల చేయాలన్న ఒక్క సంకల్పంతో మహేష్‌బాబు ఈ చిత్రాన్ని ఐదు నెలల్లోనే పూర్తిచేశారని తెలిపారు. పండగ సినిమాలకు ఇంకా సంక్రాంతి పండుగ సాగుతూనే ఉందని, మహేష్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని నిర్మాత అనీల్ సుంకర తెలిపారు. మేము ఏదైతే అనుకున్నామో, దానికన్నా ఎక్కువ కలక్షన్లు వస్తున్నాయని, తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ సంక్రాంతి అని మా డిస్ట్రిబ్యూటర్లు సంతోషాన్ని వ్యక్తం చేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరూ చెప్పినట్టే తెలుగు సినిమా కళకళలాడుతుందని, ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోయిందని అన్నారు. ఇంత పెద్ద హిట్‌గా ఈ చిత్రాన్ని నిలిపినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని, రిపిటెడ్‌గా చూడాలనుకునే ప్రేక్షకులకోసం ఒకటిన్నర నిమిషాల నిడివి గల ఓ సన్నివేశాన్ని చిత్రంలో కలుపుతున్నామని, దాంతో మరికొన్ని నవ్వులు బోనస్‌గా ప్రేక్షకులకు దొరుకుతాయని ఆయన వివరించారు. రమణ లోడు ఎత్తాలిరా అన్న డైలాగ్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోందని, రమణ బాక్సాఫీస్ లోడు ఎత్తాలిరా అని ప్రేక్షకులు అంటున్నారని ఆయన తెలిపారు.