అఘోరగా బాలయ్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటేనే వైవిధ్యం. వయసు మీదుపడుతున్నా -వైవిధ్యం విషయంలో బాలయ్య ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. కాకపోతే, ఎత్తుగడే వర్కౌట్‌కాక ఇబ్బంది పడుతున్నాడు. రూలర్ మేకోవర్ విషయంలో బాలయ్యను తక్కువ చేసి చెప్పలేం. పాతికేళ్ల ఐటీ ప్రొఫెషనల్‌గా, కరుడుగట్టిన ప్రాంతంలో రెక్లెస్‌గా ఎదిగిన పోలీస్ ఆఫీసర్‌గా వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నమే చేశారు. కాకపోతే, ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేదు. గత సంక్రాంతి సీజన్‌లో యన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ పాత్రపరంగా వైవిధ్యం కోసం కష్టపడినా ఫలితం దక్కలేదు. ఈ వైఫల్యాలను లెక్క చేయకుండా బాలయ్య ‘ఓల్డ్ అండ్ బాల్డ్’ గెటప్‌లో కనిపించినపుడే -మరో ప్రయోగమేదో చేస్తున్నారన్న కథనాలు వినిపించాయి. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు -బాలయ్య అఘోరా పాత్ర చేయనున్నారన్న కథనం ప్రచారంలో ఉంది. రూలర్ తరువాత బాలయ్య -బోయపాటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. సినిమా పూజా కార్యక్రమాలు పూరె్తైనా -సినిమా సెట్స్‌పైకైతే వెళ్లలేదు. రూలర్ ఇంపాక్ట్‌తో తాజా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు, బడ్జెట్ నియంత్రణాంశాలు చేశారన్న కథనాలు వినిపించాయి. ఇక ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్స్‌లో భాగంగా ఇప్పటికే బోయపాటి తన టీంతో కాశీ వెళ్లి, కథలో అక్కడి బ్యాక్‌డ్రాప్ కోసం కొన్ని లొకేషన్స్ లాక్ చేశారని తెలుస్తోంది. కథలో హైలెట్ కానున్న వారణాసి ఎపిసోడ్‌లో బాలయ్య ‘అఘోరా’గా కనిపించనున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. వారణాసి అడవుల్లో ఉండే అఘోరా పాత్ర -్ఫ్లష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే ఓ ఇంటెన్స్ పాత్ర కవొచ్చన్న చర్చ నడుస్తోంది. బాలయ్య పాత్రలను పవర్ఫుల్‌గా డిజైన్ చేయటంలో బోయపాటి స్టయిల్‌ని ఇప్పటికే సింహా, లెజెండ్ చిత్రాల్లో చూశాం. అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసి -హ్యాట్రిక్ హిట్టందుకునే కసితో బోయపాటి ఉన్నాడని అంటున్నారు. ప్రయోగాలెన్ని చేసినా -ఈ ప్రాజెక్టు మాత్రం బాలయ్య, బోయపాటికి కీలకమన్నది కాదనలేని వాస్తవం.