ఐపీఎస్‌గా ప్రభుదేవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్యాన్స్ సెనే్సషన్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రాన్ని తెలుగులోనూ ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’ టైటిల్‌తో ఫ్రిబవరి 7న విడుదల చేస్తున్నారు. ప్రభుదేవా తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న మాస్ మసాలా ఎటర్‌టైనర్‌ను యనమల సుధాకర్ నాయుడు సమర్పణంలో నిర్మాత ఆర్ సీతారామరాజు నిర్మించారు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా, ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచే పవర్ పోలీస్ పాత్రను ప్రభుదేవా అద్భుతంగా చేశారని చిత్రబృందం చెబుతోంది. నెలాఖరుకు ఆడియో విడుదల చేసి, ఫిబ్రవరి 7న సినిమాను ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత సీతారామరాజు తెలిపారు. డి ఇమ్మాన్ సంగీతం సమకూర్చిన చిత్రాన్ని దర్శకుడు ముఖిల్ చెల్లప్పన్ తెరకెక్కించారు.