గ్లేసియర్‌పై రిస్క్ చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం క్యారెక్టరైజేషన్‌మీదే సినిమా
వర్కౌట్ చేయాలంటే భయం నాకు.
ఏదోక కానె్సప్ట్ ఉండాలి. లేదా బలమైన కంటెంటైనా ఉండాలి. తరువాతే హీరో క్యారెక్టరైజేషన్
వర్కౌట్ చేస్తాను.

‘కానె్సప్ట్ బేస్డ్’ అనగానే కమర్షియాలిటీకి
దూరమన్న రాంగ్ అసెంప్షన్ చాలామందిలో ఉంది. హాలీవుడ్ నుంచి వచ్చే గొప్ప సినిమాలన్నీ కానె్సప్ట్ బేస్డే. వాటి కమర్షియల్ స్టేటస్‌ని చెప్పక్కర్లేదు. నా ఉద్దేశంలో కానె్సప్ట్‌ని కమర్షియల్ అప్లికేషన్‌తో బ్యాలెన్స్ చేయడమే -బెస్ట్ వర్క్. ‘డిస్కోరాజా’లో అదే చేశా.

హాలీవుడ్ మూవీ ఇంటర్‌స్టెల్లర్‌లో -ఓ కొత్త ప్లానెట్‌ని చూస్తాం. లాంకూల్ అనే గ్లేసియర్‌ని మరో ప్లానెట్‌లా చూపించాడు క్రిస్ట్ఫోర్ హోలన్. డిస్కోరాజా కోసం అదే గ్లేసియర్ మీద నిజానికి రిస్కే చేశాం. సినిమా మొత్తంమీద టెన్ మినిట్స్‌పాటు కనిపించే ఓ ఛాలెంజింగ్ ఎపిసోడ్ అది. ‘్ఫస్ట్ అండ్ ఫ్యూరియస్’ కెమెరా క్రూతో -క్రిటికల్ వెదర్ కండిషన్స్‌లో షూట్ కంప్లీట్ చేయడానికి కష్టపడ్డాం. బిగ్ స్క్రీన్‌మీద ఆడియన్స్‌కి అదో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కావొచ్చు అంటున్నాడు -దర్శకుడు విఐ ఆనంద్.
రవితేజ, నభానటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యాహోప్ లీడ్‌రోల్స్‌లో విఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం -డిస్కోరాజా. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైనె్మంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రమిది. శుక్రవారం థియేటర్లకు వస్తున్న సందర్భంలో దర్శకుడు ఆనంద్ మీడియాతో ముచ్చటించాడు.
చిన్నప్పటి నుంచే సైన్స్ ఫిక్షన్ ఇష్టం. ఫేవరేట్ జోనర్ కూడా. డిస్కోరాజా కానె్సప్ట్ పదేళ్లక్రితమే మైండ్‌లో పడింది. బట్, ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసే బేస్ కోసం చూస్తూవచ్చాను. ఏడాదిన్నర క్రితం ఓ బయో కెమికల్ లాబ్ చేస్తున్న రీసెర్చ్‌ని చదివినపుడు -ఆ బేస్ దొరికింది. అలా పుట్టిన స్క్రిప్టే -డిస్కోరాజా.
సైన్స్ ఫిక్షనే అయినా -సినిమాలో ఎక్కడా ఫోర్స్‌డ్ ఎలిమెంట్స్ ఉండవు. ఫిక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, హ్యూమర్, ఎగ్జైట్‌మెంట్.. అన్నీ కంటెంట్‌లో భాగమే. స్క్రిప్ట్ చేస్తున్నపుడు ఎంత ఎగ్జైటయ్యానో, చూస్తున్నపుడు ఆడియన్సూ అదే ఎగ్జైట్‌మెంట్ ఫీలవుతారు.
నా కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రం. ఆ కోణంలో చాలా ముఖ్యమైన సినిమా కూడా. దర్శకుడిగా నేను మరో మెట్టెక్కడానికి డిస్కోరాజా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇంతకుముందు ఎక్కడికిపోతావు చిన్నదానా, టైగర్ చిత్రాలు చేశాను.
స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే -రవితేజ మైండ్‌లో ఉన్నారు. డిస్కోరాజా -డిస్కో లవింగ్ గ్యాంగ్‌స్టర్. సో, పాత్రకు హీరోయిజం, సర్కాటిజం, ఆటిట్యూడ్, స్వాగ్ అన్నీ ఉంటాయి. ఆ వేరియేషన్స్ ఆయనే ఇవ్వగడలనుకున్నా. పైగా 1980 పీరియాడిక్, ప్రజెంట్ లైఫ్.. రెంటికీ ఆయనే సూటవుతాడనిపించింది.
రవితేజ పార్ట్ వరకూ -స్క్రిప్ట్‌లోని వన్‌లైనర్లు ఒకెత్తు. ఆన్ స్పాట్‌లో రవితేజ చేసిన వన్‌లైర్లు మరో ఎత్తు. ఫ్రీక్ అవుట్ సాంగ్‌లో అది తెలుస్తుంది. ఆ డైలాగ్స్ అన్నీ ఆయనమే. మందు సిప్ చేసిన తరువాత -ఐస్ క్యూబ్స్‌ని స్ప్లిట్ చేసే డిఫరెంట్ మేనరిజం క్యారెక్టర్‌కుంది. దాన్ని అద్భుతంగా పండించారు. క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ కావడం సినిమాకు మేజర్ ప్లస్. దర్శకుడినైనా -షూటింగ్‌లో ఓ ప్రేక్షకుడిలాగే ఎంజాయ్ చేశాను.
ఈ కానె్సప్ట్‌కు రవితేజ కనెక్టైవున్నారు. సో, ప్రాజెక్టు రిజల్ట్ చూశాక సీక్వెల్ లేదా ఫ్రీక్వెల్ అన్న ఆలోచన చేయాలి. కంటెంట్ అయితే ఇప్పటికే రవితేజకు చెప్పేశాను. వివరాలు త్వరలోనే చెబుతా.
డిస్కోరాజా -మూడు మేజర్ పార్ట్స్ మిళితం. అందుకే -డిఫరెంట్ కానె్సప్ట్ అనేది. లైఫ్ ఉంటుంది. సైన్స్ ఫిక్షన్స్ కనిపిస్తుంది. రెట్రో సీక్వెన్స్ అట్రాక్ట్ చేస్తుంది. ప్రతి సీక్వెన్స్‌నీ డీటెయిల్డ్‌గా చేశాం. మూడింటికీ ప్రాముఖ్యత ఉంది. మూడూ ఎంటర్‌టైన్ చేస్తాయి.
టైటిల్లో ‘బటర్ ఫ్లై’ సింబల్‌కు బలమైన కారణముంది. అదేంటో సినిమాలోనే చూడాలి. ఆ ఎపిసోడ్ ఆడియన్స్‌కి బలంగా కనెక్టవుతుంది.
డిసెంబర్‌లో అనుకున్నా జనవరిలో రావడానికి -షూటింగ్ లేట్ కారణం కాదు. ప్రీ ప్రొడక్షన్‌కు ఎక్కువ టైం తీసుకున్నాం. పైగా, గ్లేసియర్ మీద చేసిన సీన్స్ వెదర్ కారణంగా ఇబ్బంది పెట్టాయి. ఫస్ట్ ఎడిసోడ్‌లో వచ్చే సీజీ వర్క్ కూడా కొంత ఆలస్యమైంది. ఈ కారణంగానే -సినిమా జనవరిలో వస్తోంది. బట్, డేట్ విషయంలో నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
బాబీసింహా పాత్ర -బర్మాసేతు. ఆయన కెరీర్‌కు కొత్త టర్న్ ఇచ్చే ఇంటెన్స్ క్యారెక్టర్. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాన్యాహోప్ సైంటిస్ట్‌గా, నషానటేష్ బ్యాంక్ ఎంప్లాయిగా, రెటో ఎపిసోడ్ లవ్ సీక్వెన్స్‌లో సమ్‌థింగ్ స్పెషల్‌గా పాయల్ రాజ్‌పుత్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. వాళ్ల బెస్ట్ అవుట్‌పుట్ -సినిమాకు పెద్ద బలం.
గీతా ఆర్ట్స్‌లో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసివున్నా. బహుశ, నెక్స్ట్ ప్రాజెక్టు అదే కావొచ్చు. తమిళం నుంచి చాన్స్‌లు వస్తున్నా -ప్రస్తుతానికి అటువైపు దృష్టిపెట్టే పరిస్థితిలో లేను. తెలుగులోనూ రెండు మూడు ప్రొడక్షన్ హౌస్‌లతో డిస్కషన్స్ నడుస్తున్నాయి. వాటి వివరాలు త్వరలోనే చెబుతా.
వెబ్ సిరీస్ అంటే ఆసక్తే. బట్, నాకు టైంలేదు. కంటిన్యుయస్‌గా కమిట్‌మెంట్స్ ఉంటే, వెబ్ సిరీస్‌పై దృష్టి పెట్టలేం. ఒక్కటి నిజం -వెబ్ సిరీస్ లార్జ్ స్క్రీన్‌కు ఏమాత్రం ప్రత్యామ్నాయమైతే కాదు. అదొక కమ్యూనిటీ మీడియంగానే చూస్తా.