మేనకగా మహానటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి -సినిమా కీర్తి స్టామినాను ఎంత గొప్పగా చూపించిందో, కెరీర్‌ని అంతే వెనక్కి లాగేసిందని చెప్పాలి. మహానటి తరువాత -ట్రెడిషినల్ క్యారెక్టర్స్ కాదని ముందుకెళ్లే ధైర్యం చేయడం కీర్తికి కష్టంగానే ఉంది. కొద్దికాలం గ్యాప్‌కోసం -టాలీవుడ్ సినిమాలు తగ్గించి కోలీవుడ్‌లో బిజీ అయ్యింది కీర్తి. మహానటి ఎఫెక్టుతో మసాలా సినిమాలు ఒప్పుకునే పరిస్థితిలో లేకపోవడమే అందుక్కారణం. దీంతో లేడీ ఓరియెంటెడ్ కథల్ని వరుసగా ఒప్పేసుకున్న కీర్తి -ఇప్పుడు రెగ్యులర్ గ్లామర్ రోల్స్‌కి దూరంగానే ఉంటోంది. అయితే కోలీవుడ్‌లో సోలో క్యారెక్టర్స్‌తోపాటు గ్లామర్ రోల్స్‌కూ నో చెప్పకపోవడం వేరే విషయం. బాలీవుడ్‌లోనూ క్రేజీ ఎంట్రీ ఇస్తోన్న కీర్తి స్టామినాను పరీక్షించే మరో చాలెంజింగ్ రోల్ ఆమె ముందుకు వచ్చిందట. ఒకవిధంగా ఇది అరుదైన అవకాశంగానే చెబుతున్నారు. తన తల్లి మేనక నటించిన ‘నేత్రిక్కన్’ (రజనీకాంత్- మేనక జంటగా) రీమేక్‌లో నటించే చాన్స్ దక్కించుకుందట. ఇందులో మేనక పోషించిన పాత్రలో కీర్తి కనిపించనుందట. ఒకప్పుడు కన్నడ- తమిళంలో మేనక ఇమేజ్ చిన్నదేం కాదు. అరుదైన అవకాశంగా ఇప్పుడు కీర్తి తల్లి పాత్రను పోషించనుంది. నేత్రిక్కన్ సీక్వెల్ చేయాలన్న ఆలోచనను ధనుష్ ఇటీవలే బయటపెట్టాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ సెలెక్షన్ అవుతోందట. మామ రజనీకాంత్ పాత్రను ధనుష్ చేస్తాడు. ధనుష్- కీర్తి సురేష్ గతంలో ‘రైల్’ చేశారు. నేత్రిక్కన్ ధనుష్ డ్రీమ్ ప్రాజెక్టు కనుక, ఆయనే నిర్మాత కావొచ్చని కోలీవుడ్ వర్గాల సమాచారం.