ట్వంటీఫోర్ ఫ్రేమ్స్‌లో ‘ట్వంటీటు’ గ్లింప్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ డైరెక్టర్ల దగ్గర పనిచేసిన అనుభవంతో కొత్త దర్శకుడు శివకుమార్ చేస్తోన్న సాహసం -22. మా ఆరుూ ప్రొడక్షన్స్‌లో రూపేష్‌కుమార్, సలోనిమిశ్రా జోడీగా టెరిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ స్టేజ్‌లో ఉంది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో -ప్రమోషన్స్‌పై చిత్రబృందం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొద్దిరోజుల క్రితం డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా హీరో ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ని రిలీజ్ చేసింది. మంచి రెస్పాన్స్ రావడంతో, తాజాగా హీరోయిన్‌ని ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ని పూరి చేతుల మీదుగా విడుదల చేసింది.
సలోని మిశ్రా ఎలక్ట్ఫ్రియింగ్స్ లుక్స్ అట్రాక్టివ్‌గా ఉన్నాయి. స్ట్రిక్ట్ అండ్ స్టెబాన్డ్ ఫోలీస్ ఆఫీసర్‌గా స్టైలిష్ లుక్‌లో సలోని ఆకట్టుకుంది. దర్శకుడు శివ సినిమాలో అనుసరించిన స్టైల్‌కు ఇదోక శాంపిల్ పీస్ అంటోంది చిత్రబృందం. విక్రమ్‌జీత్ విర్క్, దేవిప్రసాద్, జయప్రకాష్, రవివర్మ తదితరులు నటిస్తోన్న చిత్రానికి బీవీ రవికిరణ్ సినిమాటోగ్రఫీ, సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు.