ట్రాఫిక్‌లో ప్రారంభమైన ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్థానం సినిమాలో నెగెటివ్ పాత్రతో ఆకట్టుకుని ఆ తరువాత హీరోగా మారి పలు చిత్రాల్లో నటించాడు సందీప్‌కిషన్. చూడ్డానికి పక్కింటి అబ్బాయిలా కనిపించే సందీప్, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. రాజసింహ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ రోజు సందీప్‌కిషన్ జన్మదినం సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ..
బర్త్‌డే ప్లాన్స్ ఏంటి?
- ప్రతి పుట్టినరోజుకు ఓ సినిమా చూస్తాను. అంతకంటే సెలబ్రేషన్స్ చేసుకునే ఉద్దేశ్యం లేదు.
‘ఒక్క అమ్మాయి తప్ప’ గురించి?
- ఇది హైటెక్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ. సినిమా 60 శాతం ట్రాఫిక్ జామ్‌లోనే వుంటుంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఇద్దరు ప్రేమికులమధ్య ఏం జరిగిందనేదే కథ. ఇందులో నా పాత్ర తెలివైన కుర్రాడిలా వుంటుంది. నాకన్నీ తెలుసు అని కాలేజీ మానేస్తాడు.
కథలో అంతగా నచ్చిన అంశం ఏమిటి?
- జనరల్‌గా మనం ట్రాఫిక్ చిక్కులను అనుభవిస్తూనే వుంటాం. అలాంటి పాయింట్‌తో ఒక కొత్త ట్రీట్‌మెంట్, జోనర్‌తో సాగే కథ కాబట్టి బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యమైన పాయింట్ చెప్పేస్తే కథలో కిక్ వుండదు.
నిత్యామీనన్‌తో పనిచేయడం?
- నిత్యా చాలా టాలెంట్ వున్న నటి అని అందరికీ తెలిసిందే. నిజంగా తనతో పనిచేయడం గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాను.
సినిమా జయాపజయాల గురించి?
- మనం నమ్మినదాన్ని చేసుకుంటూ వెళ్ళడమే నా పని. రిజల్ట్ గురించి ఆలోచిస్తా కానీ పెద్దగా పట్టించుకోను. అలాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటా.
కెరీర్ ఎలా వుంది?
- చాలా ఆనందంగా వుంది. పరిశ్రమకు వచ్చి ఆరేళ్లయింది. ఇక్కడకు వచ్చినపుడు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా చేయద్దు అనుకున్నాను. కానీ, మనం అనుకున్న పరిస్థితులకు ఇక్కడకు చాలా తేడా వుంటుంది. అది రోజురోజుకూ అనుభవంలోకి వచ్చింది.
సినిమా రిలీజ్ ఎప్పుడు?
- ఈనెల 8న పాటలను విడుదల చేస్తున్నాం. ఈనెల చివరిలోనే సినిమా విడుదల వుండొచ్చు. ఇక రాజసింహ అద్భుతంగా తెరకెక్కించాడు. నా లైఫ్‌లో నేను బాగా ఇష్టపడి కాన్ఫిడెంట్‌గా చేసిన సినిమా ఇది.
కృష్ణవంశీతో పనిచేయడం?
- నిజంగా చాలా ఆనందంగా వుంది. కృష్ణవంశీ సినిమాలు చిన్నప్పుడు చూశాను. ఆయనతో పనిచేసే అవకాశం రావడం లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఆయనతో పనిచేయడంవల్ల చాలా నేర్చుకుంటున్నాను.
తదుపరి చిత్రాలు
- తమిళ్‌లో ఓ చిత్రం కంప్లీట్ అయింది. దాంతోపాటు సి.వి.కుమార్ దర్శక నిర్మాతగా ‘మాయావన్’ అనే చిత్రం షూటింగ్ జరుగుతోంది. దాంతోపాటు కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్ర’ షూటింగ్ కూడా మొనే్న ప్రారంభమైంది.

-శ్రీ