కంటెంట్‌తో సవారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందు కథానాయకుడుగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం సవారి. సుధీర్‌బాబు, శ్రీవిష్ణు సంయుక్తంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. గతంలో విడుదల చేసిన టీజర్, ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ సినిమా విజయంపై ప్రభావం తప్పక చూపిస్తాయని, అందరికీ నచ్చుతుందని చెప్పారు. జెన్యూన్ టీమ్‌తో పనిచేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత పెద్ద సినిమాగా అవతరిస్తుందన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ దర్శకుడు సాహిత్ నాకొక కథ చెప్పాడు. అతను గుర్తులేకపోయినా ఆ కథ నాకు గుర్తుంది. సవారి చిత్రం కంటెంట్ ఉన్న చిత్రంగా కనిపిస్తోంది. సినిమా పాటలు, ట్రైలర్ అన్నీ బాగా నచ్చాయని తెలిపారు. పోస్టర్ రిలీజ్ నుంచే ఈ సినిమాకు మంచి అప్లాజ్ వస్తోందని, మంచి వ్యూస్ కూడా వచ్చాయని కథానాయకుడు నందు అన్నారు. 100% లవ్, పెళ్లిచూపులు, జయ జానకీ నాయక, సమ్మోహనం చిత్రాల తర్వాత మంచి చిత్రాలు చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఏడాదిపాటు గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని చేశానని ఆయన అన్నారు. ఈ సినిమాకోసం నటీనటులంతా బాగా శ్రమించారని, రెండు పాటలు కలసి దాదాపు 10 మిలియన్ వ్యూస్ సాధించడం సామాన్య విషయం కాదని, ప్రతి ఒక్కరికీ నచ్చే కంటెంట్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని సినిమా దర్శకుడు సాహిత్ మోత్కూరి తెలిపారు. కార్యక్రమంలో కథానాయిక ప్రియాంక శర్మ, శివ, జీవన్ పాల్గొన్నారు.