ఉప్పెనొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైష్ణవ్‌తేజ్ హీరోగా రూపొందుతున్న ఉప్పెన చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదలైంది. సముద్రాన్ని ధిక్కరిస్తున్నట్టు చేతులు చాపి బిగ్గరగా కేక వేస్తోన్న వైష్ణవ్‌తేజ్ స్టిల్ బావుంది. వచ్చే ఏప్రిల్ 2న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంతో కృతిశెట్టి కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయవౌతోంది. విజయ్‌సేతుపతి ప్రధానమైన పాత్రలో నటిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్ బ్యానర్, మైత్రీ మూవీ మేకర్ సంస్థ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైన సందర్భంగా ఈ సినిమాను వైవిధ్యమైన కథాకథనాలతో చిత్రీకరించామని, కథానాయకుడి పాత్ర సినిమాలో హైలెట్‌గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో సాయిచంద్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.