మూడు పాత్రల్లో కార్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ హీరోలకు సినిమాల్లో ప్రయోగాలు చేయడం ఇవాళ కొత్తకాదు. కమల్‌హాసన్ నుండి ఇప్పుడొస్తున్న హీరోలవరకూ అందరూ విభిన్న పాత్రలతో వైవిధ్యమైన ప్రయోగాలు చేసినవారే. తాజాగా సూర్య ‘24’ చిత్రంలో మూడు పాత్రలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో ఆయన తమ్ముడు కార్తి మూడు పాత్రల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు. ‘కాష్మోరా’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో మూడు పాత్రల్లో కన్పించనున్నాడు. సూపర్ నాచురల్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో 15 నిమిషాలపాటు 3డి ఎఫెక్ట్స్ కూడా వుంటాయని తెలిసింది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ‘రౌద్రం’ ఫేం గోకుల్ దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార, శ్రీవిద్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం చెన్నైలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ జరుపుతున్నారు. మరి మూడు పాత్రలతో కార్తి ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి!