వీడే.. రక్షకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వి’ టీం ప్రకటించినట్టే -రక్షకుడు వచ్చేశాడు. నేడు రాక్షసుడొస్తాడట. నాని, సుధీర్‌బాబు లీడ్‌రోల్స్‌లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తోన్న చిత్రం -వి. కొద్దిరోజులుగా ఊరిస్తున్నట్టే ప్రాజెక్టు నుంచి తాజాగా సుధీర్‌బాబు లుక్ రిలీజైంది. గురిపెట్టిన ‘గన్’తో సుధీర్‌బాబు ఇంటెన్స్ లుక్ ఆసక్తి రేకెత్తిస్తోంది. కథలో రక్షకుడిగా సుధీర్‌బాబు, రాక్షస మనస్తత్వంతో నాని కనిపిస్తారని చిత్రబృందం ఎప్పటినుంచో ప్రకటిస్తోంది. అంటే -వైవిధ్యమైన కథతో తెరకెక్కిస్తోన్న చిత్రంలో నాని పూర్తి నెగెటివ్ షేడ్స్ రోల్ చేస్తున్నాడా? లేదా హీరో కనుక పాత్ర క్లైమాక్స్‌కు మారుతుందా? అన్నది ఆసక్తికరం. హీరోయిన్లుగా నివేదా థామస్, ఆదితీరావు కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రం మార్చి 25న విడుదలయ్యే అవకాశముంది.