అల.. ఒక అప్రీసియేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల.. వైకుంఠపురములో చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్టని నిర్మాతలు ప్రకటించారు. అది నా విజయం కాదు, జనమిచ్చిన అప్రీసియేషన్ -అంటున్నాడు అల్లు అర్జున్. అల.. వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ ప్రభంజనం కావడంతో చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. సినిమా విజయం ఇచ్చిన ఆనందాన్ని అల్లు అర్జున్, త్రివిక్రమ్, అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ తన మనసులో మాటలు చెబుతూ -ఒక సినిమా రికార్డు క్రియేట్ చేస్తే.. ఆ గొప్ప హీరోది కాదు, ఆ సినిమాను ఆడియన్స్ అంతగా ఇష్టపడ్డారని అర్థం. అలా రికార్డు సృష్టించిన సినిమా నాదవ్వటం మాత్రం చాలా హ్యాపీ.
మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలంగానీ, స్థాయిని ఇవ్వలేమన్నది త్రివిక్రమ్ డైలాగ్. అది నిజమనిపిస్తుంది. ఈ సినిమా నాకో స్థానాన్నిచ్చింది. స్థాయికి తగ్గట్టు ప్రయాణం చేయాలనుకుంటున్నా. ఈ సినిమా ఇంత చేస్తుందని నాక్కూడా తెలీదు. త్రివిక్రమ్ కథ చెప్పారు. నచ్చింది. ఇద్దరం సరదాగా హ్యాపీ సినిమా చేశాం. మేం చేసిన పని జనానికి నచ్చిందంతే.
అల.. సక్సెస్‌లో ఫ్యాన్స్, నాన్ ఫ్యాన్స్ అనేది విడదీసి చెప్పలేం. నచ్చే సినిమా ఇస్తే అద్భుతమైన విజయాన్ని ఇస్తారనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అంతే. థాంక్యూ వెరీ మచ్ ఫర దట్.
సినిమా క్రెడిట్ విషయంలో ఒక్కరి పేరు చెప్పాల్సి వస్తే -త్రివిక్రమ్. కానీ సినిమా అనేది ఎంటైర్ టీమ్ వర్క్. ‘నా పేరు సూర్య..’ తరువాత జనరల్ డిస్కషన్‌లో త్రివిక్రమ్‌తో సినిమా చేయమని సజెషనిచ్చింది వక్కంతం వంశీ.
నా పెర్ఫార్మెన్స్‌కు ఇంత అప్లాజ్ వస్తుందని నాకే తెలీదు. ‘మీకు తెలీకుండా మీతో బాగా చేయించాలని నేను ఫిక్సయ్యాను’ అన్నారు త్రివిక్రమ్. ఆయన చెప్పారు, నేను చేశాను. సో, ఇది హండ్రెడ్ పర్సెంట్ త్రివిక్రమ్ ట్రిక్.
త్రివిక్రమ్, నేను కలిసి చేస్తే ఉండే పాజిటివ్ ఎనర్జీ జనంలో చూశా. మళ్లీ కలిసి పని చేస్తే ఆ ఆసక్తి ఉంటుందని అనిపించింది. మూడో దానికి రిథం సెట్టయ్యింది. బాల్ కనెక్టై బౌండరీ దాటేసింది.
సినిమా సక్సెస్ గురించి మిత్రుడు ప్రభాస్ ఏమన్నాడన్నది కాసేపు పక్కన పెడదాం. బట్, బాహుబలి గురించి ఇప్పటి వరకూ మాట్లాడే చాన్స్ రాలేదు. అప్పట్లో రాజవౌళికి పర్సనల్‌గా మెసెజ్ పెట్టానంతే. బాహుబలితో ప్రభాస్‌కు ఎంత పేరొచ్చినా అందుకు తను అర్హుడు. మిర్చిలాంటి సినిమా తరువాత ఐదేళ్లపాటు ఓ కమర్షియల్ హీరో ఎన్ని కోట్లో సంపాదించొచ్చు. ఐదేళ్లలో ఏడాదిన్నర వర్కింగ్ డేస్‌వుంటే, మిగతా మూడున్నరేళ్లు ఒక విషయాన్ని నమ్మి వెయిట్ చేయాలి. అలా, ప్రభాస్ చేసిన శాక్త్రిఫైజేషన్‌కు ఎంతొచ్చినా అర్హులే. మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రభాస్ స్టాట్యూ పెట్టినపుడు చాలా హ్యాపీ ఫీలయ్యా. ప్రభాస్‌కు అంత పెద్ద హిట్ వచ్చినందుడు ఐయామ్ వెరీ హ్యాపీ. ఈరోజు మా రెండు సినిమాలు టాప్ టు ఫిల్మ్స్ అయినందుకు ఇంకా హ్యాపీ. రికార్డ్సు మారుతుండొచ్చు. ఇవ్వాళ మనం కొడితే, ఆర్నెల్ల తరువాత ఇంకొకరు కొట్టొచ్చు. అయితే జనం గుండెల్లో సినిమా ఉన్నపుడు వచ్చే ఫీలింగ్ -్ఫరెవర్. దానె్నవరూ రీప్లేస్ చేయలేరు.
అల.. పట్ల చిరంజీవి హ్యాపీ ఫీలయ్యారు. సినిమా స్టామినాను ఫస్ట్ అంచనా వేసింది ఆయనే. ప్రివ్యూ చూశాక ఈ సినిమా స్థాయిని ఆయన చెప్పినపుడు -‘మీకు ఎక్కువగా నచ్చి అలా అంటున్నారేమో’ అన్నా. ‘లేదు లేదు, ఒక సినిమా ఏ లెవెల్లో ఉంటుందనేది’ అన్నారు. జనం పల్స్‌మీద ఆయనకున్న అనుభవానికి ఇదొక ఎక్స్‌పీరియన్స్. హీ ఈజ్ రియల్లీ గ్రేట్.
మూడు సినిమాల జర్నీలో త్రివిక్రమ్ నుంచి మూడు విషయాలు నేర్చుకున్నా. మనం చేసే పనిపై ఓపెన్‌గా ఉండాలి. ఏ విషయంలోనైనా హెనెస్ట్‌గా ఉండటం నేర్చుకున్నా. డిటాచ్ అయ్యి అటాచ్ అవ్వటం నేర్చుకున్నా. ఈ సినిమా ఇంత విజయానికి అదే కీలకమని నమ్ముతున్నా.
గీతా ఆర్ట్స్‌కు ఆల్‌టైం రికార్డు సినిమాలు కొత్త కాదు. చిరంజీవి సినిమాలు, గజని, మగధీరలాంటివన్నీ ఆల్‌టైం రికార్డు
కొట్టినవే. కానీ, మా నాన్నతో ఫస్ట్‌టైం ఆల్‌టైమ్ రికార్డు కొట్టడం కొడుకుగా మర్చిపోలేని అనుభూతి.