మామూలుగా లేదుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔను, రష్మిక కెరీర్ మామూలుగా లేదు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు పడుతుంటే, పడ్డ సినిమాలన్నీ హిట్టవుతుంటే -స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోడానికి రష్మిక పరుగాపకుండా పరిగెడుతోంది. గీత గోవిందంతో కెరీర్‌కు షార్ప్ టర్నిచ్చిన రష్మిక -నిన్నటి సరిలేరు నీకెవ్వరు హిట్టుతో స్టార్ హీరోల హీరోయిన్ క్యాటగిరీకి చేరిపోయింది. మహేష్‌బాబు సరసన అల్లరిచేసిన రష్మికకు -వెంటనే సుక్కూ-బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రాజెక్టులో చాన్స్ దొరకడం తెలిసిందే. ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లకముందే -ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సెట్ కానున్న ఫ్యూచర్ ప్రాజెక్టులోనూ చాన్స్ వచ్చేసిందట. ఓ పక్కన విజయ్ దేవరకొండ, నితిన్‌లాంటి మీడియం రేంజ్ హీరోలతో చేస్తూనే -్భరీ బడ్జెట్‌తో తెరకెక్కే స్టార్ హీరోల సరసనా రష్మికకు చాన్స్‌లొస్తుండటం చూస్తుంటే.. ఆమె కెరీర్ ఫేట్ మారినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం అల.. వైకుంఠపురములో బ్లాక్‌బస్టర్ హిట్టుతో ఊపుమీదున్న త్రివిక్రమ్ -తదుపరి జూ.ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది. ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్స్‌కు చేరకముందే.. రష్మికతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోందన్న మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్‌తో సినిమా.. అందులోనూ త్రివిక్రమ్ దర్శకుడంటే రష్మిక సినిమా వదులుకునే పరిస్థితే ఉండదు. అందుకే అంటారు, ఇండస్ట్రీలో టైమొస్తే కెరీర్ జెట్‌స్పీడ్‌తో పరిగెడుతుందని. రష్మిక లక్కీ గాళ్.