1978లో పలాస..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధా మీడియా పతాకంపై రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి రూపొందించిన ఈ చిత్రంలోని కొద్ది పాత్రలను యానిమేటెడ్ బుక్ రూపంలో ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది సినిమా యూనిట్. ఈ పుస్తకంలో పాత్రలన్నీ ప్రేక్షకులకు ఆసక్తికరకంగా అనువణువునా సహజత్వం నింపుతున్న విధంగా వుంటాయని, ముఖ్యంగా పలాస ప్రాంతంనుండి పుట్టిన మాటలలోని భావాలు గిలిగింతలు పెడతాయని యూనిట్ తెలియజేస్తోంది. ఈ పుస్తకాన్ని చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సినిమాల్లో రెగ్యులర్‌గా మాట్లాడే విధంగా కాకుండా కంటెంట్ ప్రధానంగా ఈ పాత్రలు మాటలు, సీరియస్‌గా సాగుతాయని తెలిపారు. సినిమా కథ లోతుగా వుంటూ పాత్రల పేర్లు, వేష భాషలు సహజంగా మన కళ్లముందు కదులుతాయని అన్నారు. ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతంలో జరిగిన, ఇంతవరకు ఎవరూ చెప్పని కథ అంటూ మొదలైన ఈ పుస్తకం మొదటి పేజీనుంచి చివరిపేజీ వరకూ ఆసక్తికరంగా చదివిస్తుందని, ఈ పరిచయ పుస్తకం విడుదల సరికొత్త గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఈ చిత్రం తెలుగు అసురన్ అవుతుందని దర్శకుడు మారుతి అన్నారు. రఘు కుంచె, జనార్దన్, లక్ష్మీ, శృతి ఇతర పాత్రల్లో నటించారు.