రాక్షసుడి లుక్ ఇలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, సుధీర్‌బాబు లీడ్‌రోల్స్‌లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తోన్న చిత్రం -వి. ప్రాజెక్టుకు సంబంధించి ముందు రక్షకుడు (సుధీర్‌బాబు) ఇంటెన్స్ లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం -తాజాగా రాక్షసుడు (నాని) కూల్, సెటిల్డ్ లుక్‌ని రిలీజ్ చేసింది. రఫ్ గెడ్డం, చేతిలో కత్తెరతో బ్లడ్ షేడ్ లుక్కిచ్చిన నాని -పాత్రపై ఆసక్తి పెంచుతున్నాడు. సుధీర్‌బాబు రక్షకుడి పాత్రకు భిన్నంగా నాని రాక్షసుడి లుక్ డిజైన్ చేశారంటూ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నాని పాత్రకు ధీటుగా పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా సుధీర్‌బాబు నటిస్తుంటే, ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ నువ్వా నేనా అన్నట్టుంటుందని, యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్ ఘట్టాలు హైలెట్‌గా వుంటాయని నిర్మాతలు శిరీష్, హర్షిత్‌రెడ్డి చెబుతున్నారు. నానికి ఇది 25వ సినిమా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్నట్టు నాని చెబుతున్నాడు. ఉగాది సందర్భంగా మార్చి 25న సినిమా విడుదలకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.