అందుకే.. ఆ ట్యాటూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందిన చిత్రం -అశ్వథ్థామ. కొత్త దర్శకుడు రమణతేజ తెరకెక్కించిన ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయిక. 31న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో నాగశౌర్య మీడియాతో మాట్లాడారు.
-ఆరంభం
కెరీర్‌లో ఇలాంటి సినిమా చేయడం ఫస్ట్‌టైం. సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలకు సంబంధించిన సీరియస్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది. అవుట్‌పుట్ సంతృప్తికరంగా వచ్చింది. కచ్చితంగా ఆడియన్స్‌కి కనెక్టవుతుందన్న నమ్మకముంది.
-జ్ఞానం
ఈ సినిమా జీవితాన్ని నేర్పిందన్న స్టేట్‌మెంట్‌కు కారణం -స్క్రిప్ట్‌నుంచే మొదలైన అనుభవం. కథ రాయడానికి జరిగిన అధ్యయనంలోనే చాలా విషయాలు అవగాహనకొచ్చాయి. అంతేకాదు, ఈ ప్రాజెక్టు చుట్టూవున్న పర్సన్స్ దగ్గర్నుంచి బడ్జెట్ వరకూ చాలా మారాయి, నేర్పించాయి. కొంతమంది వెళ్లిపోయారు. ఇంకొంతమంది కొత్తగా కలిశారు. అలాంటివన్నీ ఈ ప్రాజెక్టునుంచే చూశా. ఎప్పటికీ మర్చిపోలేని ప్రాజెక్టు కనుకే.. అశ్వథ్థామ టైటిల్‌ని ట్యాటూ చేసుకున్నా.
-నిస్వార్థం
* కథ నేనిచ్చాను కనుక -నా ప్రాత (గణ)కు ఎక్కువ ఇంపార్టెన్స్ పెడితే సినిమా బతకదు. ఇదొక క్రైమ్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్. సో, కథాక్రమంలో ప్రతి పాత్రకూ ఇంపార్టెన్స్ ఉండాలి, ఉంటుంది కూడా. ముఖ్యంగా కథలో విలన్ రోల్ పవర్ఫుల్. నా పాత్ర కొంచెం ఎమోషనల్‌గా ఉంటుంది. అలా, కథలోని ప్రతి పాత్రకూ ఓ ఇంపార్టెన్స్, బ్యాలెన్స్ ఇచ్చాం.
-నిజాయితీ
స్క్రిప్ట్ కోసం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదుర్కొన్న చాలామందిని కలిశా. వాళ్లెవరూ మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. ఆ కుటుంబాలు ఫేస్ చేస్తున్న పెయిన్‌నీ ఓ సీన్‌గా రాసుకున్నా. అలాంటిదే మొన్నటి ‘దిశా’ కుటుంబంలోనూ జరిగింది. అప్పుడనిపించింది -అంత అర్థం చేసుకుని స్క్రిప్ట్ రాశానా? అని. అందుకే -విలన్ సీన్స్ మాత్రం కొంచెం ఫిక్షన్‌కు వెళ్లాం. హీరో సీన్స్ అన్నీ జెన్యూన్‌గా రాసుకున్నాం.
-బాధ్యత
* టాలెంట్ ఉన్నవాళ్లకు చాన్సివ్వాలి. పెద్ద బడ్జెట్‌తోనే ప్రాజెక్టు చేస్తున్నాను కనుక -సీనియర్లను పెట్టుకోమని చాలామందే అన్నారు. బట్, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లను టాలెంట్ కోణంలోనే చూశా. నేను ఇండస్ట్రీకి వచ్చినపుడు సాయి కొర్రపాటి, అవసరాల శ్రీనివాస్ చాన్స్ ఇచ్చారు. నేనూ అదే చేశా. డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్.. మిగిలిన టెక్నీషియన్లంతా కొత్తవాళ్లే, కానీ టాలెంటెడ్. అలాంటి వాళ్లకు చాన్సివ్వకపోతే, నన్ను నేను మోసం చేసుకున్నట్టే.
-ఏకాలోచన
* నేను రాసుకున్న కథను సినిమా చేద్దామనిపించింది తప్ప, డైరెక్షన్ చేయాలనుకోలేదు. ఇప్పటివరకూ దర్శకత్వం గురించి ఆలోచనే లేదు. ఏ ప్రాజెక్టులోవున్నా సెట్స్‌లో డైరెక్షన్ వర్క్‌లో అస్సలు ఇన్వాల్వ్ కాను, కాలేదు. కాకపోతే, షూట్‌కి వెళ్లేముందే ప్రతి షాట్‌నీ డిస్కస్ చేసుకున్నాం. అందుకే, ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీం వర్క్‌గా పూర్తి చేశాం.
-మార్పుకోసం
* నటుడిగా ఎదగాలన్న కాంక్షతో చేసిన ప్రయత్నం -అశ్వాథ్థామ. లవర్ బోయ్ ఇమేజ్ వచ్చింది కదా అని, వాటినే చేస్తూ కూర్చోలేనుగా. పైగా, ఒకటే లవ్ జోనర్ చేయాలనిపించట్లేదు. ఇమేజ్ ఏదైనా కావొచ్చు, ఆర్టిస్ట్‌గా నాకో టాగ్ కావాలి. ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించుకుంటేనే కెరీర్ ఉంటుంది. నా కెరీర్ కోసం నన్ను నేను కొత్తగా మలుచుకుని చేసిన సినిమా -అశ్వథ్థామ.
కథకు ఆధారమైన ఇన్సిడెంట్ నా దృష్టికి వచ్చినపుడు
కదిలిపోయా. బయటికెళ్లి నేనేమీ చేయలేను. సో, కనీసం అమ్మాయిలకు అవగాహన కల్పించి జాగ్రత్త చెప్పాలన్న
ఉద్దేశంతో ప్రాజెక్టు చేశా. బాధితవర్గం నుంచి అనుమతి
తీసుకునే చేశా. రెండ్రోజుల్లో సినిమా అంతా చూస్తారు. ఇలాక్కూడా జరుగుతుందా అనేటటువంటి ఇన్సిడెంట్ అది.
-ఏకాగ్రత
* ప్రస్తుతం నా ఫోకస్ అంతా అశ్వథ్థామపైనే. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా చూస్తున్నా. ఐరా ప్రొడక్షన్ హౌస్‌లోనే కొన్ని ప్రాజెక్టులున్నాయి. ఓ కొత్త లవ్ స్టోరీ కూడా రాస్తున్నా. ఓ కొత్త హీరోతో మా బ్యానర్‌లోనే సినిమా రూపొందించాలన్న ఆలోచన ఉంది.

-మహాదేవ