చిరుని చూసే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ కందుకూరి హీరోగా శేష్ సింధూరావ్ తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ -చూసీ చూడంగానే. వర్ష బొల్లమ్మ హీరోయిన్. గోపీసుందర్ సంగీతం సమకూర్చిన చిత్రాన్ని రాజ్ కందుకూరి నిర్మించారు. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో -హీరో శివ మీడియాతో ముచ్చటించాడు.
ఆర్టిస్ట్ కావాలని ఎప్పుడనిపించింది?
యాక్టర్ కావాలన్నది చాలాకాలం నుంచీ ఉన్న ఆసక్తి. కానీ, పనికొస్తానా? లేదా? అన్న డౌట్ కూడా దానివెనకే ఉండేది. యుఎస్ స్టడీస్ టైంలో -లాస్ట్ టు ఇయర్స్ థియేటర్ ఆర్ట్స్ తీసుకున్నా. అందులో భాగంగా ఓ ప్లే పెర్ఫార్మ్ చేస్తున్నపుడు -ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్టర్‌గా ట్రై చేయాలని డిసైడ్ కావడానికి అదొక బలమైన రీజన్. క్రమంగా యాక్టింగ్‌పై ఫ్యాషన్ పెరిగింది.
నిర్మాతగా మీ ఫాదర్ గైడెన్స్?
ఫస్ట్ ఫాదర్ చెప్పింది ఒక్కటే -ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువుంటుందని. మనకు టాలెంట్‌వున్నా, అనేక ఫ్యాక్టర్లు కలిసొస్తేనే సక్సెస్ అవుతామని. కొన్నిసార్లు ఎంపిక చేసుకున్న కథ కారణంగానూ ఫెయిలవ్వొచ్చు. అప్పుడు దిగాలు పడకుండా ఫైటర్ స్పిరిట్‌తో ముందుకెళ్లాలని చెప్పారు. అలాగే, ఎంపిక చేసుకునే స్క్రిప్ట్‌లో వైవిధ్యం, నిజాయితీ ఉండేలా చూసుకోమన్నారు.
సినిమా గురించి..?
చూసీ చూడంగానే ఓ నేచురల్ స్టోరీ. ఇందులో పాత్రలన్నీ రియల్ లైఫ్‌నుంచి వచ్చినవే. సిద్దూ అనే పాత్ర చేస్తున్నా. ఈ పాత్ర పూర్తి లైఫ్ స్పాన్‌లో ఉంటుంది. సినిమాలోని అన్ని పాత్రలూ చాలా సహజంగా అనిపిస్తాయి. ముఖ్యంగా నా పాత్రను ఆడియన్స్ తమకు తామే కనెక్ట్ చేసుకుంటారని నమ్ముతున్నా. అంత రియల్ డిజైన్‌లో ఉంటుంది.
ఇండస్ట్రీకి రావడానికి ఇన్‌స్పిరేషన్?
చాలామందిలాగే నేనూ చిరంజీవి ప్రేరణతోనే వచ్చా. చిన్నపుడు ఆయన సినిమాలు ఇష్టం. లైఫ్ అవగాహనకు వచ్చాక, ఆయన సినిమాలపై గౌరవం. నటుడిగా ఇంతకాలం జర్నీ తరువాత కూడా ఆయన సినిమాపట్ల చూపించే ప్రేమ.. చాలా గ్రేట్. ఆయనస్థాయి సినిమా కాకున్నా, బాగుంటే ఆ చిన్న టీంని ఎంకరేజ్ చేయడం నాకు తెలుసు. అదీ సినిమాపట్ల ఆయనకున్న మమకారం. అదే నాకు ప్రేరణ.
కొడుకు అని హీరోగా
తీసుకోలేదన్నారు మీ ఫాదర్?
అవునండి. మా ఫాదర్ తలచుకుంటే పెద్ద దర్శకులతో కూడా నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేయొచ్చు. ఆయన ఇన్ని మంచి సినిమాలు చేయడానికి కారణం -కథే హీరో అని నమ్మే మనిషి. ఇప్పటికీ నాపై నమ్మకంతో కాదు, స్క్రిప్ట్‌పై నమ్మకంతో సినిమా చేస్తున్నారు. అయితే, ఈ స్క్రిప్ట్‌లో పాత్రకు నేను సూటవుతానని డైరెక్టర్ నమ్మారు కనుకే నాకు ఛాన్స్ వచ్చింది. అంతే.
ఎక్కువ ఆడిషన్స్ చేసినట్టున్నారు?
డైరెక్టర్ శేష్ సింధూరావ్ స్క్రిప్ట్ చెప్పినపుడే నచ్చింది. స్క్రిప్ట్ మొత్తం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌కి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. అయితే, నన్ను ఎంపిక చేసుకోడానికి 12 రోజులపాటు ఆడిషన్స్ తీసుకున్నారు. ప్రతి సన్నివేశాన్నీ ఎలా చేస్తే బావుంటుందని డిస్కస్ చేసుకుంటూ రిహార్సల్స్ చేశాం.
మూడు సినిమాలు పడినట్టున్నాయ్..
మొదటి సినిమా విడుదల కాకపోతే మంచి ఆఫర్లు వస్తుంటే, ఎవ్వరికైనా సంతోషమేగా. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే, మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. అలాగే, కొత్త డైరెక్టర్ సృజనతో మరో సినిమా చేస్తున్నా.