ఈ కథ వెనుక కష్టం కన్నీళ్లున్నాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, మెహ్రీన్ జోడీగా కొత్త దర్శకుడు రమణతేజ తెరకెక్కించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ -అశ్వథ్థామ. ఐరా క్రియేషన్స్‌పై ఊషా ముల్పూరి నిర్మించిన చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంలో దర్శకుడు రమణతేజ ప్రాజెక్టులో తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు.
* తమిళనాడులో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక -హయ్యర్ స్టడీస్ కోసం యూఎస్‌కి వెళ్లా. అప్పటికే నా మైండ్‌లో సినిమాకు సంబంధించిన లేయర్ ఒకటుంది. దాని ప్రభావంతోనే -ఇంట్లోవాళ్లకి తెలీకుండా స్క్రీన్ రైటింగ్‌లో మాస్టర్స్ చేశా.
* ఇండస్ట్రీకి రావడానికి ప్రత్యేకమైన స్ఫూర్తి అంటూ లేదు. నా ఫ్యామిలీకి సినిమా అంటే ఆసక్తి అన్నది చిన్నప్పటినుంచీ చూసిన విషయం. పైగా నా ఫాదర్ చిరంజీవి అభిమాని. ఎప్పుడైనా సినిమాలు చూసినపుడు -మా ఫ్యామిలీ మధ్య ఆ విషయాలు మాట్లాడుకోవడం, పాటలకు సరదాగా డ్యాన్స్‌లు చేయడంలాంటివి అందరిలానే ఉండేవి. బహుశ -ఆ ఎన్విరాన్‌మెంట్ నాపై ప్రభావం చూపించి ఉండొచ్చు. ఇండస్ట్రీవైపు రావడానికి అదే బలమైన కారణమని అనుకుంటుంటాను.
* స్క్రీన్ రైటింగ్‌లో మాస్టర్స్ చేస్తున్నపుడే -ఇంటెర్న్‌లో భాగంగా హాలీవుడ్ చిత్రాలకు పని చేయాల్సి వచ్చింది. అక్కడే కొన్ని ఇండిపెండెంట్ సినిమాలూ చేశా. ఇండియాకు వచ్చాక పెద్ద ప్రాజెక్టు చేయాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. ఛలో సినిమా టైంలో లక్కీగా నాగశౌర్యను కలవటం, తనకూ నాకూ కామన్ ఫ్రెండ్స్‌వున్న కారణంగా మొదలైన ట్రావెల్.. అలా ఈ ప్రాజెక్టు వర్కౌటైంది.
* ఫ్రెండ్లీ ట్రావెల్‌లో భాగంగా శౌర్య అప్పటికే రాసుకున్న కథను చెప్పాడు. మంచి కథ అనిపించింది. తరువాత నువ్వే డైరెక్టర్ అన్నపుడు షాకయ్యా. అలా శౌర్య తను రాసుకున్న ఒక ఇంటెన్స్ స్టోరీని తన ప్రొడక్షన్స్ హౌస్‌లో నాకు ఇచ్చాడు. దానికి స్క్రీన్‌ప్లే వర్కౌట్ చేసి ప్రాజెక్టు చేశాం. నేను కథ రాయాలంటే చాలా టైం పట్టుండేది. ఇక్కడ లక్కీ ఏంటంటే -కథ రెడీగా ఉంది కనుక తరువాతి పని నాకు సులువైంది.
శౌర్య రెండేళ్లు కష్టపడి మనసుపెట్టి రాసుకున్న కథను
-సృజనాత్మక సినిమాగా తీర్చిదిద్దానన్న సంతృప్తి అయితే దర్శకుడిగా నాకుంది. ఆ సంతృప్తి కలగడానికి కారణాలు మాత్రం
-ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు దొరికిన ఫ్రీడమ్. సిట్యుయేషనల్‌గా నన్నర్థం చేసుకుని టెక్నికల్ డ్రైవ్‌లో
అడ్వాన్స్‌మెంట్ చూపించిన డీవోపీ మనోజ్ రెడ్డి.
* కంటెంట్ డిమాండ్‌వల్లే పాటలకి, బీజీఎంకి మ్యూజిక్ డైరెక్టర్లని వేరుగా తీసుకున్నాం. బీజీఎంకి జిబ్రాన్‌ని ఎంపిక చేసుకోవడమన్నది పాజిటివ్ ప్రయారిటీయే తప్ప, ట్యూన్స్ ఇచ్చిన శ్రీచరణ్ పాకాలతో క్రియేటివ్ డిఫరెనె్సస్ అయితే కాదు. ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టే జిబ్రాన్ మంచి బీజీఎం ఇస్తే, శ్రీచరణ్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు.
* మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంగా రాసుకున్న కంటెంటే తప్ప, ఇటీవలి కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్‌తో కథకు సంబంధం ఉండదు. దిశలాంటి ఇన్సిడెంట్స్‌కు ముందే శౌర్య తన దృష్టికొచ్చిన ఓ పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్ ఆధారంగా కథ రాసుకున్నాడు. సో, పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌ని చూపించే సినిమాగా అశ్వథ్థామ ఉండదు.
* స్క్రీన్‌ప్లేలో మాస్టర్స్ చేశాక -చిన్న సినిమా చేద్దామన్న ఆలోచన చేయలేకపోయా. పెద్ద ప్రాజెక్టు కోసం చూస్తున్న టైంలో ఈ ప్రాజెక్టు సెట్టైంది. ఫిల్మ్‌మేకర్‌గా డ్రామాను ఇష్టపడతా. మన డైరెక్టర్స్‌లో క్రిష్ స్టయిల్‌కి కనెక్టవుతాను. కృష్ణం వందే జగద్గురుంలాంటి కథ రాసుకోలేకపోయినా -అలాంటి ఇంటెన్స్ స్టోరీని స్క్రీన్‌కు ఎక్కించాలన్న ఆశ అయితే ఉంది.
* నాగశౌర్యతో ట్రావెల్ -గొప్ప అనుభూతి. చాలా విషయాల్లో సొంత అన్నలా గైడ్ చేశాడు. శౌర్య సపోర్ట్ లేకుంటే -ఇంత పెద్ద ప్రాజెక్టు సులువుగా చేయగలిగేవాడిని కాదేమో.