ఆలోచింపజేసే నాన్నా..నేను..వర్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ ఓం డి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అజ్మీర్ చందు దర్శకత్వంలో ఎ.ఎస్.రావు రూపొందిస్తున్న చిత్రం ‘నాన్న..నేను..వర్ష’. ఆదర్శ్‌బాబు, పావని జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నవ్వుకునేవారికి నవ్వుకునేంతగా ఈ చిత్రాన్ని రూపొందించామని, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా సాగే ఈ చిత్రంలో అనేక ట్విస్టులు వున్నాయని, టీజింగ్ ఐటెమ్ రొమాంటిక్ డ్యూయెట్ పాటలతోపాటు అందరినీ ఆలోచింపజేసే అంశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్, నాగార్జునసాగర్, వరంగల్, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసిన ఈ చిత్రంలో కథానాయకుడు 12 గెటప్పుల్లో కనిపిస్తారని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. చలాకి చంటి, స్నేహ, హారిక, గంగూభాయ్, దిలీప్, రాము, శివ, శోభ, శ్రావణ్, రఘు, మంగులాల్, సమీర, అక్షయ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:విశ్వత్ చందు, దాస్ ఆదిత్య, లక్ష్మణ్, సంగీతం:డేవిడ్, కెమెరా:డి.విజయకుమార్, ఎడిటింగ్:అనీల్‌రాజ్, నిర్మాత:ఎ.ఎస్.రావు, రచన, దర్శకత్వం:అజ్మీర్ చందు.