స్పీడ్ పెంచేసినట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ కారణాలతో ఇండస్ట్రీకి దూరంగావున్న పవన్ కల్యాణ్ -పింక్‌కు ఓకే చెప్పిన దగ్గర్నుంచీ ప్రాజెక్టులపై స్పీడ్ పెంచినట్టే కనిపిస్తోంది. ‘పింక్’ రీమేక్‌కు ఓకే చెప్పడానికి వెనకాముందూ ఆలోచించిన పవన్ -తరువాతి ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇచ్చేశారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌తో ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చేయడంతో -పవన్ నుంచి మూడు సినిమాలు రావడం ఖాయమైపోయింది. పవన్‌తో సినిమా ఖరారవ్వడం హ్యాపీగా ఉందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించటం తెలిసిందే. ప్రస్తుతం సెట్స్‌పైవున్న పవన్ ప్రాజెక్టు -పింక్. బోనీకఫూర్, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రానికి దర్శకుడు వేణుశ్రీరామ్. దీంతోపాటు క్రిష్ తెరకెక్కించనున్న మరో ప్రాజెక్టుకీ పవన్ క్లియరెన్స్ ఇచ్చేశారు. మొఘలుల కాలంనాటి పీరియాడిక్ మూవీగా తెరకెక్కనున్న కథలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడట. మన పాత జానపదాల మాదిరి ఇదొక ఫాంటసీ హిస్టారిక్ మూవీగా తెరకెక్కుతుందా? లేక ఆ కాలంనాటి ఓ క్యారెక్టర్ చుట్టూ క్రిష్ కథ అల్లుతారా అన్నది చూడాలి.
మూడో ప్రాజెక్టుగా ‘గబ్బర్‌సింగ్’ కాంబినేషన్ రిపీటవుతోంది. మైత్రీ ప్రాజెక్టుకు హరీశ్‌శంకర్ డైరెక్టర్ కావడంతో -గబ్బర్‌సింగ్ తెలుగు రీమేక్ క్రియేట్ చేసిన సెనే్సషన్ ప్రస్తావనకొస్తోంది. ఈమధ్యే వరుణ్‌తేజ్ హీరోగా మరో తెలుగు రీమేక్ ‘గద్దలకొండ గణేష్’తో హిట్టుకొట్టిన హరీశ్, మళ్లీ పవన్‌తో రీమేక్‌కు వెళ్తారా? స్ట్రెయిట్ స్టోరీని తెరకెక్కిస్తారా? అన్నది చూడాలి.