నారప్ప మరదలిగా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫస్ట్‌లుక్‌తోనే వెంకటేష్ సెనే్సషన్ సృష్టించిన రీమేక్ ప్రాజెక్టు -నారప్ప. తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ ప్రియమణి. తాజాగా మలయాళీ బ్యూటీ అమలాపాల్‌ను మరో కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. నారప్ప ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లోని మరదలి పాత్రలో అమలా కనిపించనుందట. తమిళ వర్షన్‌లో టీనేజీ అమ్మాయి చేసిన ఈ క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా.. సినిమాకు కీలకం కావడంతో తెలుగు వర్షన్‌లో ఆ పాత్రను మరింత బలంగా చూపించేందుకు అమలను ఎంపిక చేశారంటున్నారు. బన్నీ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రం తరువాత అమలాపాల్ స్ట్రెయిట్ సినిమా చేయలేదు. గతేడాది ‘ఆమె’తో ఆమె చేసిన న్యూడ్ సీన్ ప్రయోగం సెనే్సషన్ అయ్యిందే తప్ప, సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. మళ్లీ ఇప్పుడు అమలాపాల్ వెంకీకి మరదలిగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నట్టే. గ్రామ రాజకీయాల నేపథ్యంగా సాగే ‘నారప్ప’ రెగ్యులర్ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను సీమలోని కల్యాణదుర్గంలో నిర్వహించారు. ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్ కోసం తమిళనాడులోని కురుమలై వెళ్లిన టీం -తదుపరి షెడ్యూల్‌ను మళ్లీ సీమలోనే నిర్వహించనుందట. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న ‘నారప్ప’ వేసవిలో థియేటర్లకు వస్తాడన్నది అంచనా.