ఆ స్టాలినే.. మా బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగంతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైన హీరో జీవా. రతిన శివ తమిళంలో తెరకెక్కించిన ‘సీర్’ను ‘స్టాలిన్’గా టైటిల్‌తో నట్టీస్, క్వీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఫిబ్రవరి 7న సినిమా థియేటర్లకు వస్తోన్న సందర్భంలో జీవా మీడియాతో ముచ్చటించాడు.
* సినిమాలో హీరో పాత్ర పేరు స్టాలిన్. అందుకే తెలుగులో ఆ టైటిల్ పెట్టాం. అందరివాడు ఉపశీర్షిక. రెండూ చిరంజీవి చిత్రాల టైటిల్స్ కావడం సక్సెస్‌కు సింబల్ అనుకుంటున్నాం.
* హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న ఓ మధ్య తరగతి కుర్రాడి కథ ఇది. అతను ఎలాంటి సమస్యలో ఇరుక్కున్నాడు? అతని కథకు మహిళా సాధికారిత అంశం ఎలా లింక్ అయ్యిందన్నదే ఇతివృత్తం. మహిళా అంశాలను స్టడీ చేసి కొన్ని వాస్తవ సంఘటనలతో దర్శకుడు తెరకెక్కించాడు.
* అన్ని జోనర్లూ మిళితమైవున్న కంప్లీట్ సినిమా ఇది. యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్, ఫ్రెండ్‌షిప్, సోషల్ కనె్సప్ట్.. అన్నీ కథలో ఉంటాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కనుక -ఆడియన్స్ కనెక్టవుతారన్న నమ్మకం ఉంది.
* ‘రంగం’ను తెలుగు ఆడియన్స్ ఆదరించారు. తెలుగు ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకునే కొన్ని సీన్స్, డైలాగ్స్‌ని డిజైన్ చేశాం. మాతృక తమిళంతోపాటు తెలుగు ఆడియన్స్‌నీ సినిమా నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం.
* స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలంటే మంచి కథ కుదరాలి. రంగం తరువాత స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయమని వెల్‌విషర్స్ చెప్పినా, తమిళంలో బిజీ కారణంగా చేయలేకపోయా. తెలుగు అంతగా రాకపోవడం ఒక ఇబ్బందిగా మారింది నాకు. బట్, తమిళంలో మంచి ఆఫర్లొస్తున్నాయి. అక్కడ చేస్తున్న ‘జిప్సీ’ చిత్రానికి ప్యాన్ ఇండియా అప్పీల్ ఉంది.
* ఆడియన్స్ మంచి కంటెంట్ కోరుకుంటున్నారు. అందుకే -తెలుగు సినిమాలు తమిళంలో, తమిళ చిత్రాలు తెలుగులో ఆదరణకు నోచుకుంటున్నాయి. సౌత్ ఫిల్మ్ మేకింగ్ స్టయిల్ ఇప్పుడు నార్త్‌లో వర్కౌటవుతోంది.
* నటుడిగా నా కెరీర్ బావుంది. భవిష్యత్‌లో దర్శకుడిని కావాలన్న ఆలోచనలైతే లేకపోలేదు. అయితే, దేనికైనా ప్రతిభ ముఖ్యం. ఎక్కడైనా రాణించగలమో లేదో మనల్ని మనం జడ్జి చేయగలగాలి.