చరణ్.. జస్ట్ అలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదాత్తమైన పాత్రలో చిరంజీవిని చూపించేందుకు దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సోషల్ మెసేజ్ స్టోరీ -ఆచార్య. అధికారికంగా టైటిల్ ప్రకటించలేదుకానీ -కథనంగా పుట్టుకొచ్చిన టైటిల్ ప్రస్తుతం చలామణీ అయిపోతుంది. దేవుడి భూముల కబ్జా బాగోతాన్ని నిగ్గదీసే కథానాయకుడిగా చిరు పోషిస్తోన్న పాత్ర పేరు ‘గోవిందాచార్య’ కావడంతో -పుట్టుకొచ్చిన టైటిల్ బలంగానే జనంలోకి వెళ్లిపోయింది. ఇదిలావుంటే -ఇందులో నిర్మాత రామచరణ్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్టు చాలాకాలంగా వినిపిస్తోన్న మాటే. చిరు యవ్వన దశ పాత్రను పోషించే అవకాశముందంటూ ఇప్పటివరకూ ప్రచారం సాగినా -తాజాగా చిరుతో చరణ్‌కు కాంబినేషన్స్ సీన్స్ సైతం ఉన్నాయన్నది తాజాగా వినిపిస్తోన్న మాట. ‘సిద్ధు’ పాత్రలో కనిపించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్నా -చిరు పాత్రతో ఈ పాత్రకున్న సంబంధమేంటన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. చరణ్ పోషించే పాత్ర కేవలం పది పదిహేను నిమిషాల నడివి మాత్రమే ఉంటుందట. ప్రస్తుతం రాజవౌళి తెరకెక్కిస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ ప్రాజెక్టులో బిజీగావున్న చరణ్ -అది పూర్తికాగానే ‘ఆచార్య’ బోర్డ్‌పైకి వస్తాడన్నది తాజా టాక్. సో, ట్రిపుల్ ఆర్ మేకోవర్‌లోనే చరణ్ ఉండే అవకాశం ఉందంటున్నారు. సినిమాను వేగంగా పూర్తి చేయాలన్న చిరు ప్రతిపాదన తు.ఛ తప్పకుండా అమలైతే -సినిమా ఆగస్టు రెండోవారంలో థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ట్రిపుర్ ఆర్ సినిమా విడుదల ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాకపోవడంతో -సంక్రాంతి తరువాత థియేటర్లకు వచ్చే పెద్ద చిత్రం ఇదే కావొచ్చు.