Others

ధ్యానంతో జ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు పూరక రేచక కుంభకములతో అహంకార మమకారాలను జయించి ఓంకార దర్శనం చేసి జయ విజయముల వలె శాపవిమోచనం పొందాలి. జయవిజయములు అను పూరకము రేచకములను దాటి సుషుమ్నా రూపమైన సనకసనందనాదుల వలె సత్వగుణ సంపన్నులై సుషుమ్నా నాడి ద్వారా పరబ్రహ్మం సహస్రారములో దర్శించుటయే కేవల కుంభకము లోని నిర్వికల్పసమాధి. పూరకం తరువాత చేయునది అంతర కుంభకము. రేచకము తరువాత బహిఃకుంభకము, చిత్త స్థైర్యము సంపాదించుటకు, విషయవాసనలు దూరం చేసుకొనుటకుతద్వారా సమాధిస్థితి పొందుటకు ఉపకరించు ఉపకరణం కుంభకము.
అంతఃకుంభకము చేసి ఆలోచనలు స్థిరంగా ఉండాలని, వాటి గురించి ఆలోచించాలి. అలాగే రేచకంలో కామ, క్రోధాదులు విసర్జిస్తున్నట్లు భావించాలి. బహిఃకుంభకము చేసి వదిలిన విషయములు మరలా లోనికి రాకుండా స్థిరపరచుకోవాలి. తన మనస్సులోని ఆలోచనల్ని ఈ ప్రాతిపదికగా నిరంతరం పరిశీలించుకోవాలి. అంతఃకుంభకం 5 నుంచి 15 సెకన్లు చేయాలి. బహిఃకుంభకం 5 నుంచి 10 సెకన్లు మాత్రమే చేయాలి. తరువాత ఆజ్ఞాచక్రంలో గురవే పరబ్రస్మ అనే భావంతో ఓంకార రూపంలో గానీ జ్యోతిరూపంలోగానీ సోహం శబ్దంగా గానీ మనస్సులో ధ్యానించాలి. ఇది మొదటిస్థితి. ధ్యానలక్షైై్య్పం మనస్సును 12 క్షణములు నిలుపుట ధారణ. 12 ధారణలు, 1్ధ్యనం , 12 ధ్యానాలు ఒక సమాధిస్థితి - 1728 క్షణాలు. ఆధ్యాత్మిక పరంగాప్రాణాయామ క్రియలు మానసిక శక్తిని, ప్రాంశక్తిని వృద్ధిపరచును. ప్రాణమయ, మనోమయకోశాలో సమతుల్యానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఉన్నత ఆధ్యాత్మిక ప్రగతికి, జీవనానికి సహాయపడుతుంది.
కుంభకము యొక్క స్థితిలో ప్రత్యక్ష అనుభవము మనోనాశం. ఇది సాధనా సాధ్యమేగానీ పుస్తక జ్ఞానం వల్ల లభించదు. సద్గురువు సమక్షంలో చేయు ప్రాణాయామ సాధన గురుపరంపరగా గురువు యొక్క కృపాకటాక్షాలతో యోగవిద్య లభించును.
కుంభక స్థితిలో అంతర్ముఖ యాత్ర ప్రారంభమవుతుంది. అప్పుడు చిత్తం మీద పడిన ఒక్కొక్క ఆవరణ తొలగిపోతుంది. ఒక్కొక్క వాసన, సంస్కారము, విషయ వాంఛల బాహ్య ప్రపంచ క్రియలు క్షీణించి నిర్మలత్వం ఏర్పడుతుంది. మొదట చిత్తంపై శక్తి ప్రతిబింబము ప్రకాశితమవుతుంది. తరువాత చిత్త తాదాత్మ్యము చెంది ఆత్మలోవిలీనమవుతుంది. ఇది అనుభవము వలన కలుగు అనుభూతియే కానీ మాటలల్లో వ్యక్తం చేయజాలని అవ్యక్తస్థితి. ఇడాపింగళానాడుల ద్వారా శ్వాస వలన ప్రాణము అంతర్ముఖ ప్రవాహం చేయును. కానీ వీటివలన నాడీశుద్ధి కలుగునే కానీ మనోసంయమము, చిత్తవృత్తి నిరోధము జరుగదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎంత దీర్ఘమైనను ఇంద్రియాలు, చిత్తము, అన్నీ వ్యాపారాలు నడుస్తూనే ఉంటాయి. త్రిగుణాతీతమైన ఆనందస్థితి కేవల కుంభకములోనే కలుగుతుంది.
మనస్సుకు ప్రధానంగా రెండులక్షణాలున్నవి. 1.చంచలము, 2. నిశ్చలము. మనస్సు ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంలో సంపర్కముచెంది విషయ వాసనలతో తాదాద్మ్యము చెందుతున్నపుడు ఎల్లవేళలా చలించుచుండును. మనో నిర్మాణమునకు పుట్టుకకు ఆత్మ మూలం కనుక మనస్సుకు జన్మస్థానం, స్వస్థానం , ఆత్మ ఆ నివాసస్థలం నిశ్చలం.
*
సమాప్తం

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899