క్రైమ్/లీగల్

నకిలీ నోట్ల తయారీ ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. రెండు ముఠాలకు చెందిన మొత్తం 13 మందిని సౌత్, నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీ కుమార్ కేసుకు సంబంథించిన వివరాలను వెల్లడించారు. దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.8.5 లక్షల నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్లు, ఆరు సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల తయారీ ముఠా ముద్రిస్తున్న నోట్లలో రూ.2 వేలు, రూ.500 నోట్లు ఉన్నాయని సీపీ వెల్లడించారు. అదే విధంగా నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ ముఠాకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశారు. నగరంలోని అబిడ్స్, జగదీశ్ మార్కెట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నకిలీ నోట్లు చెలామణి చేస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ ముఠా నుంచి రూ.9.27 లక్షల నకిలీ నోట్లు స్వాధీ నం చేసుకున్నారు. ఈ ముఠాలోని నాయకుడు సంగారెడ్డి నుంచి ఈ దందాను సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ నోట్ల తయారీ, చెలామణికి సంబంధించి పట్టుబడ్డ మూడు ముఠాల నుంచి రూ.17.77 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నకిలీ నోట్ల తయారీ ముఠాను పట్టుకున్న దక్షిణ మండలం, నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులను అంజనీ కుమార్ అభినందించారు.