ఎందుకు కలిశారో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ లీడ్‌రోల్స్‌తో రానున్న చిత్రం -త్రీమంకీస్. ఓరుగల్లు సినీ క్రియేషన్స్‌పై జి అనిల్‌కుమార్ తెరకెక్కించిన చిత్రంలో కారుణ్య చౌదరి హీరోయిన్. ఫిబ్రవరి 7న విడుదలవుతున్న సందర్భంలో హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ నిర్వహించారు. రాఘవేంద్రరావు, ఆకాష్ పూరి, మంచు లక్ష్మి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. త్రీ మంకీస్ ట్రైలర్, బిగ్ టికెట్‌ను రాఘవేంద్రరావు లాంచ్ చేసి మాట్లాడుతూ -జబర్దస్త్ జర్నీ మొదలైన ఫిబ్రవరి 7నే ఆ టీం చేసిన సినిమా విడుదలవుతుండటం యాదృచ్చికమే అయినా సంతోషకరం. సినిమా హిట్టవ్వాలని ఆకాంక్షిస్తున్నా. టీంకి ఆల్ ది బెస్ట్ అన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ -నిజానికి సినిమా తీయడంకంటే జబర్దస్త్ షో చేయడం కష్టం. టీవీ షోతో మొదలైన వీరి స్నేహం సినిమా వరకూ వచ్చింది. మరిన్ని సినిమాలతో గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ హిందీలో త్రీ ఇడియట్స్ ఎంత హిట్టయ్యిందో తెలుగులో ఈ సినిమా అంత హిట్ కావాలన్నారు. కార్యక్రమంలో ఆకాష్ పూరి, నిర్మాత నగేష్, రామ్‌ప్రసాద్, గెటప్ శీను, సుధీర్ తదితరులు మాట్లాడారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ -త్రీ మంకీస్‌ను ఎంకరేజ్ చేస్తున్న దర్శకులు, హీరోలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలుస్తారో ఎవ్వరికీ తెలీదు. కానీ, కారణం మాత్రం ఉంటుందన్న లైన్‌పై సినిమా ఉంటుందన్నారు.