పిట్టకథే కానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవ్య క్రియేషన్స్‌పై చందు ముద్దు దర్శకత్వంలో వి ఆనంద్‌ప్రసాద్ రూపొందించిన చిత్రం -ఓ పిట్ట కథ. చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ఇటీవలే దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. క్యారెక్టర్స్ పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌లో దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ -వైవిధ్యమైన టైటిల్‌తో రూపొందించిన చిత్రంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. పిట్టకథే అయినా పెద్ద కథేనన్న నమ్మకం కలుగుతోంది. అప్పట్లో పెద్ద వంశీ పోస్టర్లు, టీజర్లు చూసి ఎంతగా ఫీలయ్యామో, ఆ స్థాయిలో చందు ఈ సినిమా తీశాడనిపిస్తోంది. వేసవికి ప్రేక్షకులకు మంచి వినోదం -అంటూ ప్రశంసించారు. నిర్మాత వి ఆనంద్‌ప్రసాద్ మాట్లాడుతూ -దర్శకుడు చెప్పిన పిట్టకథ నచ్చి సెట్స్‌మీదకు వెళ్లామని, సినిమా కామెడీ, థ్రిల్లింగ్ అంశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిందన్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దర్శకుడు చందు ముద్దు మాట్లాడుతూ -ఓ గ్రామంలో జరిగే ప్రేమకథ. ప్రతి సీన్ స్వచ్ఛంగా ఉంటుంది. కడుపుబ్బ నవ్విస్తూనే, ఏం జరుగుతుంద ఉత్కంఠ కలిగిస్తుంది. క్లైమాక్స్ వరకూ థ్రిల్లింగ్ సాగుతుంది. థ్రిల్లింగ్ ట్విస్ట్‌ల స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన చిత్రమిది అన్నారు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావ్, నిత్యశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్, సిరిశ్రీ చిత్రంలో నటించారు.