లేడీ సైకో కథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక లేడీ సైకోగా మారితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? అనే కథాంశంతో ముప్పిడి క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో గౌతమ్ క్రియేషన్స్ ఓ సినిమా తెరకెక్కిస్తోంది. ప్రియాంషా, ముప్పిడి వాసు, ఘటికాచలం ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం షూటింగ్ బుధవారం హైదరాద్‌లో ప్రారంభమైంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ జి తెరకెక్కిస్తోన్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి మూడోవారం నుంచి మొదలు పెడుతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. గ్రామీణ నేపథ్యంగా సాగే కథలో సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంతంతోపాటుగా జిగిత్యాల ఫారెస్ట్, నెల్లూరు, వరంగల్ జలపాతాల లొకేషేన్స్‌లో చిత్రీకరిస్తామని ముప్పిడి వాసుదేవరావు తెలిపారు. ‘ఇదొక థ్రిల్లర్ కథాంశం. లేడీ సైకోవల్ల ఎదురయ్యే పరిణామాలను చూపిస్తున్నాం’ అని దర్శకుడు శ్రీనివాస్ చెప్పారు.