టాలీవుడ్ నాకు స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ పరిశ్రమకు తనకెప్పుడూ ప్రత్యేకమేనని అంటోంది సాయి ధన్సిక. ఇక్కడి సినిమా పరిశ్రమలో మంచి వాతావరణం ఉంటుందని కొత్త సినిమా మొదలైన సందర్భంలో ఆనందం వ్యక్తం చేసింది. కబాలి ఫేమ్ సాయిధన్సిక ప్రధాన పాత్రగా శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్‌పై కొత్త సినిమా ప్రారంభమైంది. పియస్‌ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తోన్న ఈ చిత్రంతో హరి కొలగాని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లాంఛనంగా ప్రారంభమైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి తొలి క్లాప్‌ని వివి వినాయక్ ఇవ్వగా, నిర్మాత బీవీఎస్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత దిల్ రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. గురువారం నుంచి 20 రోజులపాటు హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ నిర్వహిస్తామని చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత వైజాగ్ బాబ్చి మాట్లాడుతూ -మంచి కథ దొరకటంతో డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతనవుతున్నా. అందుకు బెక్కం వేణుగోపాల్ సహకారం మర్చిపోలేను. ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నా అన్నారు. దర్శకుడు హరి కొలగాని మాట్లాడుతూ -శబ్ధాలయా, అన్నపూర్ణ సంస్థల్లో దర్శకత్వ విభాగంలో పని చేశాను. నేను రాసుకున్న కథ సినిమాగా మారడానికి బెక్కం వేణుగోపాల్, నిర్మాత సహకారం మర్చిపోలేను. ధన్సిక పాత్ర కొత్తగా ఉంటుంది అన్నాడు. హీరోయిన్ సాయిధన్సిక మాట్లాడుతూ -హరి చెప్పిన కథ బాగా నచ్చింది. టీం కొత్తదే అయినా మంచి ప్లానింగ్‌తో ఉంది. సినిమాలో నేను కొత్తగా కనిపిస్తానని చెప్పుకొచ్చింది.